ETV Bharat / sports

'సచిన్​, కోహ్లీ కన్నా ధోనీకే క్రేజ్ ఎక్కువ' - dhoni popularity

భారత దిగ్గజ క్రికెట్​ సచిన్​ తెందుల్కర్​, టీమ్​ఇండియా సారథి కోహ్లీ కన్నా మహేంద్రసింగ్​ ధోనీకే ఎక్కువ అభిమానులు ఉంటారని అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్​ సునీల్​ గావస్కర్​.

Dhoni'
ధోనీ
author img

By

Published : Sep 20, 2020, 5:39 AM IST

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్​ ధోనీకి మించిన క్రేజ్​ మరే ఇతర క్రికెటర్​కు ఉండదని అభిప్రాయపడ్డాడు భారత దిగ్గజ క్రికెటర్​ సునీల్​ గావస్కర్​. పాపులారిటీలో క్రికెట్​ దేవుడు సచిన్​ తెందుల్కర్​, ప్రస్తుత టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీని అధిగమించాడని అన్నాడు.

సచిన్​(ముంబయి), కోహ్లీ(దిల్లీ) వంటి మెట్రో నగరాల నుంచి వచ్చారు. వారికి క్రికెట్​ పట్ల అవగాహన ఎక్కువే ఉంటుంది. కానీ ధోనీ క్రికెట్​ సంస్కృతి తెలియని రాంచి నుంచి వచ్చాడు. ఓ సాధారణమైన మనిషి. అందుకే దేశం మొత్తం అతడిని ప్రేమిస్తోంది.

-గావస్కర్​, భారత దిగ్గజ క్రికెటర్​.

ప్రస్తుతం గావస్కర్​.. ఐపీఎల్​ 13వ సీజన్​లో కామెంటేటర్​గా వ్యవహరిస్తున్నాడు. ఈ లీగ్​లో హోరాహోరిగా జరిగిన ఆరంభ మ్యాచ్​లో ముంబయిపై ధోనీ సేన విజయం సాధించింది.

ఇదీ చూడండి క్వారంటైన్​ చాలా కష్టంగా గడిచింది : ధోనీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.