తాత్కాలిక విరామం తీసుకొని, జట్టుకు దూరంగా ఉన్నాడు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ. శనివారం నుంచి రాంచీలో ప్రారంభమయ్యే భారత్-దక్షిణాఫ్రికా మూడో టెస్టు మ్యాచ్ చూసేందుకు వస్తున్నాడు. ఝార్ఖండ్ మాజీ కెప్టెన్, ధోనీ చిన్ననాటి మిత్రుడు మహీర్ దివాకర్తో కలిసి వీక్షించనున్నాడు. శనివారం ఉదయమే అక్కడికి చేరుకుంటాడని దివాకర్ తెలిపాడు.
ప్రపంచకప్ తర్వాత వ్యక్తిగత పనులతో బిజీగా ఉంటున్నాడు ధోనీ. ఈ క్రమంలో రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలూ వచ్చాయి. అయితే రాంచీ మ్యాచ్ చూడటానికి ధోనీ వస్తే ఈ విషయంపై ఏమైనా స్పష్టత వస్తుందేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవీ చూడండి.. అద్భుతంగా క్యాచ్ పట్టిన ఆస్ట్రేలియా క్రికెటర్