టీమ్ఇండియా కెప్టెన్ ధోనీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. భారీ షాట్లు కొట్టే నైపుణ్యం ఉండటం వల్లే కెరీర్ ప్రారంభంలో అతడిని ప్రోత్సాహించానని అన్నాడు. టాప్ఆర్డర్లో పంపించి, పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు పేర్కొన్నాడు. 2005లో విశాఖపట్నంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు.
"వైజాగ్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ మూడో స్థానంలో బ్యాటింగ్ దిగాడు. అద్భుతమైన సెంచరీ చేశాడు. దీనితో పాటే ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం వచ్చినప్పుడల్లా, భారీ స్కోరు చేసేవాడు. సచిన్ ఆరో స్థానంలో అడుగుపెడితే.. ఎప్పటికీ సచిన్ కాలేడు. కానీ ధోనీకి అది సాధ్యమైంది" -సౌరభ్ గంగూలీ, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
తను కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత చాలాసార్లు ధోనీ టాప్ ఆర్డర్లో ఆడాలని కోరుకున్నట్లు గంగూలీ చెప్పాడు. కానీ అది జరగలేదని అన్నాడు. ధోనీ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ధోనీ టీమ్ఇండియాలోకి అరంగేట్రం చేసినప్పుడు గంగూలీనే కెప్టెన్‌గా ఉన్నాడు. 2005 వైజాగ్‌లో పాకిస్థాన్‌తో వన్డేలో ధోనీని మూడో స్థానంలో పంపించింది గంగూలీనే. ఆరోజు మహీ 148 పరుగులు చేసి, దాదా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు.