ETV Bharat / sports

'ఐపీఎల్​ను  దేశంలోనే నిర్వహించాలి' - BCCI latest news

ఐపీఎల్​ను పూర్తిగా స్వదేశంలోనే నిర్వహించాలని ఫ్రాంచైజీలు పట్టుబడుతున్నాయి. టోర్నీని విదేశాల్లో నిర్వహిస్తారని వస్తున్న ప్రచారంపై ఐపీఎల్​ అధికారి ఒకరు స్పందించారు. లీగ్​ను విదేశాల్లో జరపడం వల్ల ఆర్థిక భారం పడుతుందని తెలిపారు .

Destination wedding doesn't work without family: Franchises on hosting IPL abroad
ఐపీఎల్​ను స్వదేశంలోనే నిర్వహించాలంటున్న ఫ్రాంఛైజీలు
author img

By

Published : Jun 16, 2020, 6:20 AM IST

కరోనా కారణంగా ఐపీఎల్ 13వ సీజన్​ నిర్వహణపై వివిధ రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ టోర్నీని విదేశాల్లో నిర్వహించాలని భారత క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ) పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో పరిస్థితులు మెరుగుపడకపోతే లీగ్​ను విదేశాల్లో నిర్వహించడమే పరిష్కారమని ఐపీఎల్​ ఛైర్మన్​ బ్రిజేశ్​ పటేల్​ వెల్లడించారు. అయితే టోర్నీని స్వదేశంలో నిర్వహించడం ఫ్రాంచైజీలతో పాటు లక్షలాది క్రికెట్​ ప్రేమికులుకూ చాలా ముఖ్యమని ఐపీఎల్​ అధికారి ఒకరు అభిప్రాయపడుతున్నారు.

Destination wedding doesn't work without family: Franchises on hosting IPL abroad
బ్రిజేశ్​ పటేల్​

"విదేశీ ప్రయాణాలను ఓ నిమిషం పక్కన పెడితే.. వేరే దేశాల్లో ఐపీఎల్​ నిర్వహించాలనే దానిపై ఒకసారి ఆలోచించండి. స్వదేశంలో టోర్నీ నిర్వహించడానికి ప్రస్తుతం తగిన పరిస్థితి లేదు. కానీ, ఐపీఎల్​ను స్వదేశంలో నిర్వహించాలని చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే క్రికెట్​ను ఇక్కడ ఓ మతంలాగా భావిస్తారు. కాబట్టి ఈ టోర్నీతో ప్రజల మనసులపై చూపే సానుకూల ప్రభావాన్ని మీరు విస్మరించలేరు. విదేశీ ఆటగాళ్లు భారత్​కు వస్తే తక్కువ మందే అవ్వడం వల్ల క్వారంటైన్​కు వీలవుతుంది. కానీ, ఇక్కడి నుంచి వేరే దేశాల్లోకి వెళ్లడానికి ఎక్కువ మంది రిస్క్​ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రసారకర్తల నుంచి వచ్చే డబ్బునే చూస్తున్నాం తప్ప మిగిలినవి ఆలోచించడం లేదు".

- ఐపీఎల్​ అధికారి

ఐపీఎల్​ నిర్వహణపై వివిధ క్రికెట్​ బోర్డుల నుంచి ఆతిథ్యమిస్తామని అభ్యర్థనలు వచ్చినప్పటికీ, స్వదేశానికి వెలుపల టోర్నీని నిర్వహించే ఆలోచనకు ఫ్రాంచైజీలు మొగ్గు చూపడం లేదు. ఎందుకంటే భారత ప్రజలకు ఈ టోర్నీ ఎంతగానో చేరువైన కారణంగా టోర్నీని ఇక్కడే నిర్వహించాలని వారు ఆశిస్తున్నారు.

ఐపీఎల్​ ట్రోఫీ

"2009లో దక్షిణాఫ్రికా వేదికగా నిర్వహించిన ఐపీఎల్​ తర్వాత ఓ ఏడాదిపాటు బీసీసీఐ సహా ఫ్రాంచైజీలు ఆర్థిక భారాన్ని ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో ఫ్రాంచైజీలకు బీసీసీఐకు మధ్య తీవ్ర గందరగోళం నెలకొంది. 2014లో జరిగిన టోర్నీలో కొంత భాగమే యూఏఈ వేదికగా జరగడం వల్ల కొంతమేర నష్టప్రభావం తగ్గింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టోర్నీలో సగభాగాన్ని విదేశాల్లో నిర్వహించలేం. కాబట్టి విదేశాల్లో ఐపీఎల్​ నిర్వహించాలనే ఆలోచన ఇప్పుడు సముచితం కాదు" అని ఐపీఎల్​ అధికారి ఒకరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి... టీమ్​ఇండియాలో స్మిత్​కు ఇష్టమైన క్రికెటర్?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.