ETV Bharat / sports

ఉపఖండ జట్ల మధ్య తొలి పోరు.. గెలుపెవరిది..?

కార్డిఫ్ వేదికగా మంగళవారం అఫ్గానిస్థాన్- శ్రీలంక మధ్య ప్రపంచకప్​ మ్యాచ్​ జరగనుంది. గత మ్యాచ్​ల్లో ఓడిన ఈ రెండు జట్లు తొలి విజయం సాధించాలని ఊవిళ్లూరుతున్నాయి.

ఉపఖండ జట్ల మధ్య తొలి పోరు.. గెలుపెవరిది..?
author img

By

Published : Jun 4, 2019, 9:01 AM IST

Updated : Jun 4, 2019, 9:17 AM IST

ప్రపంచకప్​లో ఉపఖండ జట్ల మధ్య మొదటి మ్యాచ్​ జరగనుంది. కార్డిఫ్ వేదికగా మంగళవారం శ్రీలంక- అఫ్గానిస్థాన్ తలపడనున్నాయి. టోర్నీలో బోణీ కొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి .

తన తొలి మ్యాచ్​లో శ్రీలంక న్యూజిలాండ్​పై చిత్తుగా ఓడిపోయింది. కెప్టెన్ కరుణరత్నే మినహా మరెవరూ రాణించలేకపోయారు. శ్రీలంక బౌలర్ల వైఫల్యంతో నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఛేదించింది న్యూజిలాండ్. ​అన్ని విభాగాల్లో రాణించి అఫ్గాన్​ ​ జట్టుపై గెలవాలని లంక ఆశిస్తోంది.

Sri Lanka cricket team
శ్రీలంక క్రికెట్ జట్టు

గత మ్యాచ్​లో ఆస్ట్రేలియా చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడింది అఫ్గానిస్థాన్. కానీ ఈ రోజు శ్రీలంకపై గెలిచి తానెంటో నిరూపించుకోవాలని ఆరాటపడుతోంది. రషీద్​ఖాన్, నబీ, ముజీబుర్ రెహ్మాన్ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. బ్యాట్స్​మెన్ నెట్స్​లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Afghanistan cricket team
అఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టు

జట్లు(అంచనా)

అఫ్గానిస్థాన్:

హమీద్ హసన్, గుల్బాదీన్ నైబ్(కెప్టెన్), షెహజాద్, హజ్రాతుల్లా, రహ్మత్ షా, హస్మతుల్లా షాహిదీ, నజీబుల్లా జద్రాన్, నబీ, రషీద్ ఖాన్, దవలత్ జద్రాన్, ముజీబుర్ రెహ్మాన్

శ్రీలంక:
లసిత్ మలింగ, మాథ్యూస్, సురంగ లక్మల్, ఉదానా, తిసారా పెరీరా, తిరిమన్నె, జీవన్ మెండిస్, ధనుంజయ డిసిల్వా, దిముత్ కరుణరత్నే(కెప్టెన్), కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్

ఇది చదవండి: లంకపై పది వికెట్ల తేడాతో కివీస్​ ఘనవిజయం

Patna (Bihar), June 03 (ANI): Chief Minister Nitish Kumar attended 'Iftar' party hosted by Hindustani Awam Morcha chief Jitan Ram Manjhi in Patna. Former chief minister of Bihar Rabri Devi and Former health minister of state Tej Pratap was also present in Manjhi's 'Iftar' party. Last evening, Jitan Ram Manjhi had attended Rabri Devi's 'Iftar'. Jitan Ram Manjhi served as 23rd Chief Minister of Bihar from 20 May 2014 to 20 February 2015.
Last Updated : Jun 4, 2019, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.