దిల్లీ వేదికగా అరుణ్‌జైట్లీ స్టేడియంలో భారత్ X బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం తొలి టీ20 జరగనుంది. అయితే పొగమంచు అధికంగా ఉన్న కారణంగా మ్యాచ్ రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది దక్షిణ దిల్లీ మున్సిపల్ కార్పోరేషన్(ఎస్డీఎమ్సీ). గాలి కాలుష్యం, దూళి శాతం తగ్గించేందుకు భారీగా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
-
. @delhi_cricket splashing water to settle the dust ahead of 1st T20I pic.twitter.com/SK7U370YA5
— Aritra Mukherjee (@aritram029) November 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">. @delhi_cricket splashing water to settle the dust ahead of 1st T20I pic.twitter.com/SK7U370YA5
— Aritra Mukherjee (@aritram029) November 2, 2019. @delhi_cricket splashing water to settle the dust ahead of 1st T20I pic.twitter.com/SK7U370YA5
— Aritra Mukherjee (@aritram029) November 2, 2019
"దిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వద్ద వాయు కాలుష్యం, దూళిని తగ్గించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాం. కొంత మంది పెట్రోలింగ్ బృందాలను పెట్టి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. 9 నీటి ట్యాంకులు, 12 స్ప్రింక్లర్లు , 10 స్వీపింగ్ యంత్రాలతో మా బృందాలు ఎప్పటికప్పుడు రోడ్లు, పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. 35 మంది స్వచ్ఛ సేవకులతో మైదాన వద్ద ప్రత్యేకమైన స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించనున్నాం".
-- దక్షిణ దిల్లీ మున్సిపల్ కార్పోరేషన్
పరిస్థితిపై సమీక్షించేందుుకు పెట్రోలింగ్ బృందాలు 24 గంటలూ అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు అధికారులు. చుట్టు పక్కల ప్రాంతాల్లో చెత్త తగులబెట్టడం, నిర్మాణ సంబంధిత పనులు చేయడం, వాతావరణంలో కాలుష్యం వదిలే పరిశ్రమలపై ప్రత్యేక చర్యలకు ఆదేశించింది దిల్లీ ప్రభుత్వం.
ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై ఇప్పటికే 255 కేసులు నమోదు చేశాయి ప్రత్యేక బృందాలు. జరిమానాల రూపంలో రూ.13.24 లక్షలు సేకరించినట్లు ఎస్డీఎమ్సీ అధికారులు తెలిపారు.
మాస్కులు లేకుండానే...
ఇరుజట్ల ఆటగాళ్లు శుక్రవారం ఇన్‌డోర్‌లో ప్రాక్టీస్ చేయాల్సి ఉన్నా స్టేడియంలోనే సాధన చేశారు. పొగమంచు అధికంగా ఉన్నా భారత ఆటగాళ్లు మాస్కులు లేకుండా కనిపించారు. ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్‌ల ఆధ్వర్యంలో రోహిత్‌శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్‌తో పాటు మరికొందరు సాధన చేశారు. అయితే బంగ్లా ఆటగాళ్లు మాత్రం కాసేపు మాస్కులు ధరించినా పరిస్థితులు మారాక వాటిని తీసేశారు.
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఈ విషయంపై తాత్కాలిక కెప్టెన్ రోహిత్‌శర్మతో చర్చించాడు. ఆటగాళ్లు ఎలాంటి ఇబ్బంది పడటం లేదని, గాలి నాణ్యత క్షీణించినా అదేమీ ప్రభావం చూపడంలేదని దాదాకు వివరించాడు రోహిత్. బంగ్లా కోచ్ డొమింగో మాట్లాడుతూ... "ఇక్కడి వాతావరణం ఆహ్లాదంగా ఉంది, ఉక్కపోత లేదు. పొగమంచు మాత్రం తీవ్రంగా ఉంది. ఆ సమస్య ఇరుజట్లకూ సమానమే. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదులు చేయడం లేదు. కళ్లు మండినా, గొంతు నొప్పి కలిగినా వీటివల్ల ఆటగాళ్లు చనిపోయే పరిస్థితి లేదు" అని తీవ్రంగా వ్యాఖ్యానించాడు.