టీ20 ప్రపంచకప్ నిర్వహణపై తుది నిర్ణయాన్ని ఐసీసీ ఆలస్యం చేయడం పట్ల బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డాడు.
"కరోనా మహమ్మారి కారణంగా క్రికెట్ టోర్నీలు నిర్వహించడం సవాలుగా మారింది. ఈ సమయంలో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. అవసరమైన వాటి కోసం త్వరగా ఓ నిర్ణయానికి రండి. ఎందుకంటే ఈ టోర్నీ ప్రణాళికపై ఇతర దేశాల క్రికెట్ ప్రణాళికలు ఆధారపడి ఉన్నాయి."
- అరుణ్ ధుమాల్, బీసీసీఐ కోశాధికారి
టోర్నీ నిర్వహణపై తుది నిర్ణయం వెల్లడించకుండా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కాలయాపన చేస్తుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బుధవారం జరిగిన సమావేశంలో అంశాలన్నింటిపై పూర్తిగా చర్చ జరగని కారణంగా సోమవారం తిరిగి మళ్లీ సమావేశాన్ని నిర్వహించనుంది ఐసీసీ.
తొలుత ఈ-మెయిల్స్ బహిర్గతం అవ్వడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సమావేశాన్ని ఆలస్యం చేసింది ఐసీసీ. అలాగే బీసీసీఐతో ఉన్న పన్ను పరిష్కారాలతో పాటు మరికొన్ని సమస్యలపై బుధవారం చర్చ జరిగింది.
ఇదీ చూడండి... 'ఐపీఎల్లో మార్పులకు మేము వ్యతిరేకం'