ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ లాక్‌డౌన్ సమయంలో టిక్‌టాక్ చేస్తూ దుమ్మురేపాడు. తన సతీమణి క్యాండిస్ వార్నర్‌తో కలిసి బుట్టబొమ్మ, రాములో రాములా, బ్యాంగ్‌బ్యాంగ్ వంటి పాటలను అనుకరిస్తూ అలరించాడు.
ఇప్పుడేమో భారత్‌లో టిక్‌టాక్‌ను నిషేధించారు. అయినప్పటికీ వార్నర్ ఇతర సోషల్‌మీడియా వేదికలను ఉపయోగించుకొని అభిమానులకు కనెక్ట్ అవుతున్నాడు. తాజాగా తన కుమార్తెతో ఐవీతో కలిసి క్రికెట్ ఆడాడు. ఆమెకు బంతులు విసిరాడు. వరుసగా రెండు క్యాచులు అందుకున్న అతడు మూడో బంతికి హ్యాట్రిక్ సాధించాలనుకున్నాడు. కానీ ఐవీ అతడి ఆటలు సాగనివ్వలేదు. బంతిని లెగ్‌సైడ్ కొట్టింది.
- View this post on Instagram
When you’re locked up what do we do girls!! 🤷🏼♂️🤷🏼♂️ practice catching 😂😂 #family #cricket #fun
">
ఇక మరో వీడియోలో ఐవీ.. గోల్ఫ్ బంతిని ఒడుపుగా కొట్టిన విధానం చూసి వార్నర్ ఆశ్చర్యపోయాడు. ఎంత అద్భుతంగా స్వింగ్ చేసిందో అని ఆనందం వ్యక్తం చేశాడు. ఆ స్వింగ్ చూసి తనకు ఈర్ష్య కలిగిందని చెప్పాడు. లాక్‌డౌన్‌లో తన కుమార్తెల మధ్య బంధీ అయ్యానని సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి అంటున్నాడు.
- View this post on Instagram
Thoughts on Ivy swing!!!!!!! I’m jealous😂😂 #golf #kids #family Nice Swing
">