ETV Bharat / sports

కార్తీక్​, రసెల్​ గొడవ పడలేదు: హస్సీ - దినేశ్​ కార్తీక్​, యాండ్రూ రసేల్​ గొడవ పడలేదు

కోల్​కతా నైట్​ రైడర్స్​ సారథి దినేశ్​ కార్తీక్​, ఆ జట్టు ఆటగాడు ఆండ్రూ రసెల్​ మధ్య గొడవ జరిగిందంటూ వస్తోన్న వార్తలను ఖండించాడు ఆ జట్టు మెంటార్ డేవిడ్​ హస్సీ​. వారిద్దరి మధ్య చక్కని స్నేహ బంధం ఉందని తెలిపాడు.

David Hussey
డేవిడ్​ హుస్సే
author img

By

Published : Sep 14, 2020, 3:19 PM IST

కోల్​కతా నైట్​ రైడర్స్​ సారథి దినేశ్​ కార్తీక్, ఆ జట్టు ఆటగాడు ఆండ్రూ రసెల్​ మధ్య గతేడాది గొడవ జరిగినట్లు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్​ బ్రాడ్​ హగ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు​. దీంతో కేకేఆర్​ యాజమాన్యం వారిపట్ల అసంతృప్తిగా ఉన్నట్లు చెప్పాడు. తాజాగా ఈ విషయమై స్పందించిన కేకేఆర్​ మెంటార్​ డేవిడ్ హస్సీ ఈ వ్యాఖ్యలను ఖండించాడు. దినేశ్​, రసెల్​ మధ్య ఎటువంటి ఘర్షణ జరగలేదని స్పష్టం చేశాడు. వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉందన్నాడు.

"వారిమధ్య ఎటువంటి గొడవలు లేవు. ఇద్దరు అన్యోన్యంగా కలిసి ఉంటారు. కార్తీక్​ ముక్కుసూటి మనిషి. సహచర ఆటగాళ్లను బాగా ప్రోత్సాహిస్తాడు. ఎప్పుడూ గెలవాలనే లక్ష్యంతో ఆడుతుంటాడు."

-డేవిడ్​ హస్సీ​​, కేకేఆర్​ మెంటార్​.

దీంతోపాటు మోర్గాన్​-కార్తీక్​ భాగస్వామ్యం.. ఈ ఏడాది కేకేఆర్​ జట్టుకు విజయాన్ని అందిస్తుందని అభిప్రాయపడ్డాడు హస్సీ. వీరిద్దరు క్లిష్ట పరిస్థితుల్లో బౌలర్లకు మార్గనిర్దేశం చేయగలరని చెప్పాడు.

కేకేఆర్​ ఇప్పటివరకు రెండు సార్లు ఐపీఎల్​ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ ఏడాది కూడా విజయాన్ని అందుకోవాలని తీవ్రంగా కృషి చేస్తోంది. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10వరకు బయోసెక్యూర్​ వాతావరణంలో ఈ మెగాలీగ్​ జరగనుంది.

ఇదీ చూడండి కనురెప్ప వేయకుండా ధోనీ సరేనన్నాడు: ఉతప్ప

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.