ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడేటప్పుడు వర్ణవివక్ష ఎదుర్కొన్నానని ఇటీవల ఆరోపణలు చేసిన వెస్టిండీస్ మాజీ సారథి డారెన్ సామి తాజాగా ఆ వివాదంపై స్పష్టతనిచ్చాడు. తనని అలా ప్రత్యేక పదంతో పిలిచిన వారిలో ఒకరితో మాట్లాడానని చెప్పాడు. అప్పుడు వాళ్లు ప్రేమ పూర్వకంగానే అలా పిలిచారని తనతో చెప్పినట్లు వివరించాడు.
సామి.. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో పోస్టు చేస్తూ తనతో పాటు శ్రీలంక ఆటగాడు తిసార పెరెరాను సన్‌రైజర్స్ ఆటగాళ్లు వర్ణవివక్ష పదజాలంతో పిలిచారని తీవ్ర ఆరోపణలు చేశాడు. తాజాగా ట్విట్టర్లో మరో పోస్టు చేసి దానిపై స్పందించాడు.
-
I’m please to say that I’ve had a really interesting conversation with one of the guys and we are looking at ways to educate rather than focusing on the negatives. My brother reassured me that he operated from a place of love 💕 and I believe him. 🙏🏾🙏🏾🙏🏾
— Daren Sammy (@darensammy88) June 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I’m please to say that I’ve had a really interesting conversation with one of the guys and we are looking at ways to educate rather than focusing on the negatives. My brother reassured me that he operated from a place of love 💕 and I believe him. 🙏🏾🙏🏾🙏🏾
— Daren Sammy (@darensammy88) June 11, 2020I’m please to say that I’ve had a really interesting conversation with one of the guys and we are looking at ways to educate rather than focusing on the negatives. My brother reassured me that he operated from a place of love 💕 and I believe him. 🙏🏾🙏🏾🙏🏾
— Daren Sammy (@darensammy88) June 11, 2020
"నన్ను అలా పిలిచినవారిలో ఒకరితో మాట్లాడాను. ఈ విషయం చెప్పడానికి సంతోషంగా ఉంది. మా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అయితే, వర్ణవివక్షపై దుష్ప్రచారాలు మానేసి, అందరికీ అవగాహన కల్పించాలని అనుకున్నాం. నా సోదరుడు అప్పుడు ప్రేమ పూర్వకంగా అలా పిలిచాడని పూర్తి భరోసా ఇచ్చాడు. అతడిని నమ్ముతున్నా".
- డారెన్ సామి, వెస్టిండీస్ మాజీ కెప్టెన్
సామిని అలా పిలిచిన వారిలో టీమ్‌ఇండియా పేసర్ ఇషాంత్ శర్మ ఉన్నాడు. అతడు 2014 మే 14న ఇన్‌స్టాలో ఒక ఫొటో పోస్టు చేశాడు. అందులో ఇషాంత్, భువనేశ్వర్ కుమార్, సామి, డేల్ స్టెయిన్ ఉన్నారు. ఈ సందర్భంగా వారి పేర్లను పేర్కొంటూ సామి పేరుకు బదులు ఆ ప్రత్యేక పదాన్ని ఉపయోగించాడు.
అమెరికాలో ఇటీవల జార్జ్ ఫ్లాయిడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్‌పై ఓ పోలీస్ అధికారి తన ప్రతాపం చూపించడం వల్ల అతను మృతిచెందాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే సామి స్పందిస్తూ క్రికెట్‌లోనూ తాను వర్ణ వివక్ష ఎదుర్కొన్నానని వివాదానికి తెరలేపాడు.
ఇదీ చూడండి... ప్రేక్షకుల సమక్షంలోనే భారత్-ఆసీస్ సిరీస్!