ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడుతోంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడి నిరాశలో కూరుకుపోయింది జట్టు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో అనూహ్య ఓటమి చెందిన సఫారీ జట్టుకు ఆటగాళ్ల గాయాల బెడద మరింత కలవరపెడుతోంది.
బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ పేసర్ ఎంగిడి భారత్‌తో జరిగే మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో స్టార్ పేసర్ స్టెయిన్‌ను తీసుకోవాలన్న జట్టు ఆశలు ఆవిరయ్యాయి. భుజం గాయం కారణంగా ఈ సఫారీ స్పీడ్‌స్టర్ ప్రపంచకప్‌తో పాటు భవిష్యత్తులోనూ ఇక బౌలింగ్ చేసే పరిస్థితులు కనిపించేలా లేవు. ప్రస్తుతం గాయమైన భుజం.. చికిత్సకు స్పందించట్లేదు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా పూర్తిగా బౌలింగ్‌కు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించారు. ఇతడి స్థానంలో హెన్రిక్స్ జట్టులో చోటు సంపాదించాడు.
ఇవీ చూడండి.. ఫీల్డింగే మా కొంప ముంచింది: మోర్గాన్