దాదాపు 7 నెలల తర్వాత మైదానంలోకి తిరిగి అడుగుపెట్టనున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఐపీఎల్లో చెన్నైకు సారథ్యం వహించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తన ఫ్రాంఛైజీపై ప్రశంసల వర్షం కురిపించాడు. తనను గొప్ప ఆటగాడిగా 'సీఎస్‌కే' తీర్చిదిద్దిందని, క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఎంతో దోహదపడిందని అన్నాడు.
"అన్ని విషయాల్లో మెరుగవ్వడానికి సీఎస్‌కే ఎంతో సహాయపడింది. మనిషిగా, క్రికెటర్‌గా.. మైదానంలో, వెలుపలా, క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ఉండాలో నేర్పించింది. నువ్వు ఏం సాధించినా వినయంగానే ఉండాలని చెప్పింది"
- ధోనీ, టీమిండియా మాజీ కెప్టెన్
దక్షిణాది క్రికెట్ ప్రేక్షకులు తనపై చూపించిన అభిమానం వెలకట్టలేనిదని అన్నాడు.
"తలా' అంటే సోదరుడు అని అర్థం. అభిమానులు తమ ప్రేమ, ఆప్యాయతకు ప్రతిరూపంగా పిలుచుకుంటారు. చెన్నై లేదా దక్షిణాదికి వచ్చినప్పుడు నన్ను ఎవరూ పేరుతో పిలవరు. 'తలా' అనే పిలుస్తారు. నాపై ఉన్న ప్రేమ, గౌరవానికి అది గుర్తు. అంతేకాక అతడు సీఎస్‌కే అభిమానై ఉంటాడు"
- ధోనీ, టీమిండియా మాజీ కెప్టెన్
ప్రపంచకప్ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన తర్వాత ధోనీ, క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. విరామం తీసుకోవడం వల్ల మహీ, కొత్త ఉత్సాహంతో పునరాగమనం చేస్తాడని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు.
మొదటి మ్యాచ్‌లో ధోనీ, రోహిత్
ఈనెల 29 నుంచి మొదలయ్యే ఐపీఎల్ 13వ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్ తలపడనుంది. ఈ సీజన్‌లో ధోనీ సత్తా చాటి టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇదీ చూడండి.. అలాంటి ప్లేయర్ ప్రతి జట్టుకు కావాలి: హర్మన్