ETV Bharat / sports

క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య నేత్రదానం - రవీంద్ర జడేజా న్యూస్​

భారత స్టార్ క్రికెటర్​ రవీంద్ర జడేజా భార్య రివాబా తన కళ్లను దానం చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతిఒక్కరూ ఇదే విషయమై స్వచ్ఛందంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు

Cricketr Ravindra jadeda's wife Riva ba jadeja decide to Donate Eyes on her Birthday
జడేజా భార్య రివాబా జడేజా
author img

By

Published : Sep 6, 2020, 9:50 AM IST

టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా భార్య రివాబా, శనివారం తన పుట్టినరోజు సందర్భంగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తన కళ్లను దానం చేయనున్నట్లు ప్రకటించారు. ఇలాంటి వాటి కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు.

రివాబా జడేజా

"దేవుడి దయ వల్ల నా శరీరంలో ప్రతి అవయవం ఉంది. అందుకే నేను ఎలాంటి బాధ అనుభవించలేదు. కానీ, నేను నా కళ్లను దానం చేయడం ద్వారా ఇబ్బందులు పడేవారికి సహాయం చేసినట్లు అవుతుంది. దీనివల్ల ఏ విధమైన అనుభూతి పొందుతున్నానో ఇప్పుడు వివరించలేను. కానీ, ఈ నిర్ణయం నాకు సంతృప్తినిచ్చింది. మన మరణం తర్వాత కూడా మరొకరికి ఉపయోగపడేలా ఉండాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా"

- రివాబా జడేజా, జడేజా భార్య

గుజరాత్​ జామ్​నగర్​కు చెందిన రివాబా గతేడాది, భారతీయ జనతా పార్టీలో చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని కర్ణిసేన మహిళా విభాగానికి హెడ్​గా వ్యవహరిస్తోంది.

ఐపీఎల్​లో ఆడేందుకు దుబాయ్​ వెళ్లిన జడేజా.. ప్రస్తుతం ప్రాక్టీసు మొదలుపెట్టాడు. చెన్నై సూపర్​కింగ్స్​ తరఫున బరిలో దిగనున్నాడు.సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు మ్యాచ్​లు జరగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.