కరోనా కారణంగా మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా క్రీడాటోర్నీలు వాయిదా పడ్డాయి. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ఇప్పుడిప్పుడే మ్యాచ్‌ల నిర్వహణకు కొన్ని దేశాలు పూనుకుంటున్నాయి. తాజాగా క్రీడా కార్యక్రమాలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైంది దక్షిణాఫ్రికా. ఈ క్రమంలో జూన్ 27 నుంచి '3 టీమ్ క్రికెట్' అనే వినూత్న పోటీ నిర్వహించనుంది సఫారీ క్రికెట్ బోర్డు. అయితే ఇందులో జరిగే ఒకే మ్యాచ్‌లో మూడు జట్లు పోటీ పడటం గమనార్హం. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది.
క్రికెట్ దక్షిణాఫ్రికా ప్రకటించిన నివేదిక ఆధారంగా జూన్ 27న నిర్వహించనున్న టోర్నీలో మూడు జట్లు పోటీ పడనున్నాయి. లాక్డౌన్ తర్వాత దక్షిణాఫ్రికాలో ప్రత్యక్ష ప్రసారమయ్యే తొలి క్రీడాకార్యక్రమం ఇదే కావడం విశేషం. ఈ ఫార్మాట్లో తొలి ప్రయత్నంగా స్వదేశానికి చెందిన 24 మంది క్రికెటర్లను ఎంపిక చేసుకుని ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. ఒక్కొక్క జట్టులో 8 మంది ఆటగాళ్లు మాత్రమే భాగం కానున్నారు.
-
💬 @ABdeVilliers17: "It’s a great idea and credit must go to Cricket South Africa and Rain for working to develop this new and innovative style of cricket."
— Cricket South Africa (@OfficialCSA) June 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Read more 👉 https://t.co/5fho8KPjQq#3TCricket #SolidarityCup pic.twitter.com/MGmI7cAYry
">💬 @ABdeVilliers17: "It’s a great idea and credit must go to Cricket South Africa and Rain for working to develop this new and innovative style of cricket."
— Cricket South Africa (@OfficialCSA) June 17, 2020
Read more 👉 https://t.co/5fho8KPjQq#3TCricket #SolidarityCup pic.twitter.com/MGmI7cAYry💬 @ABdeVilliers17: "It’s a great idea and credit must go to Cricket South Africa and Rain for working to develop this new and innovative style of cricket."
— Cricket South Africa (@OfficialCSA) June 17, 2020
Read more 👉 https://t.co/5fho8KPjQq#3TCricket #SolidarityCup pic.twitter.com/MGmI7cAYry
ఒకే మ్యాచ్‌లో మూడు టీమ్‌లు
సాలిడారిటీ కప్ కోసం ఈగల్స్, కింగ్ ఫిషర్స్, కైట్స్.. ఈ మూడు జట్లు పోటీ పడనున్నాయి. ఈగల్స్ టీమ్‌కు కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్, కింగ్ ఫిషర్స్ జట్టు కెప్టెన్‌గా రబాడా, కైట్స్ టీమ్‌కు సారథిగా ప్రస్తుత దక్షిణాఫ్రికా టీమ్ కెప్టెన్ డికాక్ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ కొత్త ఫార్మాట్ క్రికెట్ అభిమానుల్లో నూతనోత్తేజాన్ని తిరిగి తెస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్రేమ్ స్మిత్.
"ప్రపంచవ్యాప్తంగా టోర్నీలన్నీ ఆగిపోవడం వల్ల క్రికెట్ అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. అదే విధంగా క్రికెటర్లందరూ ఎప్పుడెప్పుడు మైదానంలో అడుగుపెడతామా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ కారణంగా క్రికెట్ దక్షిణాఫ్రికా సాలిడారిటీ కప్ అంటూ వినూత్న పోటీని నిర్వహించబోతోంది. ఈ ఫార్మాట్ కోసం పనిచేయడం ఆసక్తిగానూ.. ఆనందంగానూ ఉంది.".
- గ్రేమ్ స్మిత్, క్రికెట్ దక్షిణాఫ్రికా డైరెక్టర్
-
It’s finally here! #3TCricket #SolidarityCup Get more info at https://t.co/lthxPiT5ZJ pic.twitter.com/4WZqgQZ7oE
— Andile Phehlukwayo (@andileluck19) June 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">It’s finally here! #3TCricket #SolidarityCup Get more info at https://t.co/lthxPiT5ZJ pic.twitter.com/4WZqgQZ7oE
— Andile Phehlukwayo (@andileluck19) June 17, 2020It’s finally here! #3TCricket #SolidarityCup Get more info at https://t.co/lthxPiT5ZJ pic.twitter.com/4WZqgQZ7oE
— Andile Phehlukwayo (@andileluck19) June 17, 2020
'3 టీమ్ క్రికెట్' ఫార్మాట్ రూల్స్:
- మూడు జట్లు ఒకే మ్యాచ్‌లో పోటీ పడనున్నాయి. ఒక్కొక్క టీమ్‌లో 8 మంది ఆటగాళ్లు ఉంటారు.
- మొత్త 36 ఓవర్లుంటాయి. 18 ఓవర్ల చొప్పున రెండు భాగాలుగా విడదీశారు.
- ఒక ఇన్నింగ్స్‌లో ఒక జట్టు మాత్రమే బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఒక్కో టీమ్ 12 ఓవర్లు బ్యాటింగ్ చేయనుంది.
- తొలుత ఎవరు బ్యాటింగ్ చేయాలా అని డ్రా ద్వారా నిర్ణయిస్తారు.
- ఒక్కో జట్టు బ్యాటింగ్ చేసే 12 ఓవర్లలో.. తొలి 6 ఓవర్లకు ఒక జట్టు, మిగిలిన ఆరు ఓవర్లకు మరో జట్టు ఫీల్డింగ్ చేస్తుంది.
- జట్టులో ఉండే 8 మంది ఆటగాళ్లలో 7 మంది ఔట్ అయితే చివరిగా ఉన్న బ్యాట్స్‌మన్ ఒంటరిగా ఆడవచ్చు. అయితే అతను సరిసంఖ్య పరుగులే చేయాల్సి ఉంటుంది (అంటే 2,4,6 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంటుంది).
- అత్యధికంగా ఒక్క బౌలర్ 3 ఓవర్ల వరకు వేయవచ్చు.
- ఎవరైతే ఎక్కువ పరుగులు చేస్తారో వారే విజేతలుగా నిలుస్తారు.
- అత్యధిక పరుగులు చేసిన జట్టుకు బంగారాన్ని.. ఆ తర్వాత రెండో అత్యధిక పరుగులు చేసిన టీమ్‌కు వెండి.. మిగిలిన చివరి జట్టుకు కాంస్య పతకాలను బహుమతిగా ఇవ్వనున్నారు.
జట్ల వివరాలు:
కింగ్‌ఫిషర్స్ టీమ్: రబాడా (కెప్టెన్), డుప్లెసిస్, క్రిస్ మోరిస్, తబ్రేజ్ షంసీ, రీజా హెండ్రిక్స్, జన్నెమాన్ మలన్, హెన్రిచ్ క్లాసన్, గ్లెంటన్ స్టుర్మాన్.
కైట్స్ టీమ్: డికాక్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, బవుమా, ఎన్రిచ్ నోర్ట్జే, డ్వేన్ ప్రిటోరియస్, బ్యూరాన్ హెన్డ్రిక్స్, జెజె స్మట్స్, లూథో సిపామ్లా.
ఈగల్స్ జట్టు: ఏబీ డివిలియర్స్ (కెప్టెన్), మర్కరమ్, లుంగిసాని ఎంగిడి, ఆండిలే, ఫెహ్లుక్వాయో, రాస్సీ వాన్ డెర్ డుసెన్, జూనియర్ డాలా, కైల్ వెర్రిన్నే, సిసాండా మగాలా.
ఇదీ చూడండి... 'కోహ్లీ లాంటి లక్షణాలే బెన్స్టోక్స్లోనూ'