క్రికెట్ అభిమానులకు శుభవార్త. హాంగ్జౌ వేదికగా 2022లో జరిగే ఆసియా క్రీడల్లో క్రికెట్ ఉండనుంది. 2010,2014 ఉన్న ఈ క్రీడను... 2018 ఇండోనేసియాలో జరిగిన పోటీల్లో తొలగించారు.
ఆదివారం జరిగిన ఆసియన్ ఒలింపిక్ కౌన్సిల్ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియాకు ఆహ్వానం అందింది. టీట్వంటీ ఫార్మాట్లో ఇవి జరగనున్నాయి.
బిజీ షెడ్యూల్ మూలంగా ఇంతకు ముందు జరిగిన గేమ్స్‌లో టీమిండియా పాల్గొనలేదు. జరగబోయే ఆసియా క్రీడలకు చాలా సమయం ఉన్నందున బీసీసీఐతో చర్చించి భారత క్రికెట్ జట్టు పాల్గొనేది లేనిది నిర్ణయిస్తారు.--బీసీసీఐ అధికారి
గత నెలలో హాంగ్జౌను సందర్శించిన ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా గౌరవ అధ్యక్షుడు... ఇక్కడ క్రికెట్ ఆడేందుకు ఈ ప్రదేశం అనువుగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు.
2010లో బంగ్లాదేశ్, పాకిస్థాన్ విజేతలుగా నిలిస్తే.. 2014లో పురుషుల విభాగంలో శ్రీలంక గెలిచింది. మహిళల విభాగంలో పాకిస్థాన్ విజయం సాధించింది.
1998లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లోనూ ఇండియా జట్టు పాల్గొంది. షాన్ పొలాక్ నేతృత్వంలో దక్షిణాఫ్రికా జట్టు బంగారు పతకం సాధించింది.