ఒలింపిక్స్‌లో క్రికెట్‌నూ చేర్చాలని చాలో రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. 2028 లాస్‌ఏంజెలిస్‌లో జరగనున్న విశ్వక్రీడల్లో క్రికెట్‌ను చేర్చే దిశగా ఐసీసీ ముందడుగు వేయనున్నట్టు మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎమ్‌సీసీ) ఛైర్మన్ మైక్ గ్యాటింగ్ తెలిపారు. ఈ మేరకు ఐసీసీ ఛీప్ ఎగ్జిక్యూటివ్ మను సహానేతో చర్చించారు.
"మను సహానే, నేను ఈ విషయంపై మాట్లాడుకున్నాం. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే ఆలోచనలో ఉన్నట్టు ఆయన చెప్పారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులకు ఇదో మంచి పరిణామం"
-మైక్ గ్యాటింగ్, ఎమ్‌సీసీ ఛైర్మన్.
ఇప్పటికే 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళా క్రికెట్‌ను నామినేట్ చేశారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే ఈ క్రీడకు మరింత ఆదరణ పెరుగుతుందని, విశ్వక్రీడల్లో క్రికెట్‌కు మంచి భవిష్యత్తు ఉండబోతుందని గ్యాటింగ్ అభిప్రాయపడ్డారు.
ఇది చదవండి: 'వన్డేల్లో కోహ్లీ సెంచరీలు 75 నుంచి 80'