ETV Bharat / sports

కరోనాపై పోరుకు పుజారా, సునీల్​ గావస్కర్​ విరాళం - Sunil Gavaskar PM-cares fund

కరోనాపై పోరాటానికి ఇప్పటికే తమ వంతు విరాళాలందించారు ప్రముఖులు. తాజాగా భారత టెస్ట్​ బ్యాట్స్​మెన్​ పుజారా, మాజీ క్రికెటర్​ సునీల్​ గావస్కర్​లు కూడా ఈ జాబితాలో చేరారు. పీఎం-కేర్స్​, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధులకు తమవంతు సాయమందిస్తున్నట్లు వీరు ప్రకటించారు.

COVID-19 Fight: Gavaskar contributes Rs 59 lakh, Pujara joins list of donors
కరోనాపై పోరుకు పుజారా, సునీల్​ గవాస్కర్​ల విరాళం
author img

By

Published : Apr 8, 2020, 5:36 AM IST

కరోనా వైరస్(కొవిడ్-19) మహమ్మారిపై జరుగుతున్న పోరుకు దేశ ప్రజలంతా అండగా నిలవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు పీఎం-కేర్స్ పేరుతో విరాళాలు సేకరించడం కూడా ప్రారంభించారు. ఇప్పటికే భారత్​ క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, మాజీ కెప్టెన్ గంగూలీ, ధోనీ, సారథి విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తదితరులు తమకు తోచిన మొత్తాన్ని పీఎం-కేర్స్‌కు విరాళంగా అందించారు. తాజాగా వీరి సరసన చేరారు పుజారా, సునీల్​ గావస్కర్​లు.

వైద్యులు, పోలీసులకు కృతజ్ఞతలు

పీఎం-కేర్స్ ఫండ్‌తో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి సహాయనిధికి కూడా తాను విరాళం అందిస్తున్నట్లు పుజారా ప్రకటించాడు. అయితే ఎంత మొత్తాన్ని ఇవ్వనున్నాడనేది మాత్రం స్పష్టంగా చెప్పలేదు.

'నేను, నా కుటుంబం పీఎం-కేర్స్ ఫండ్, గుజరాత్ ముఖ్యమంత్రి సహాయనిధికి.. మాకు తోచిన చిన్న మొత్తాన్ని విరాళంగా అందించాము. మీరు కూడా మీకు తోచిన సహాయం చేయండి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తమ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్యులు, పోలీసులకు నా కృతజ్ఞతలు.' అని పుజారా ట్వీట్ చేశాడు.

సునీల్​ గవాస్కర్​ విరాళం

కొవిడ్‌-19 వ్యాప్తిని అరిక‌ట్టేందుకు జ‌రుగుతున్న పోరాటంలో దిగ్గ‌జ బ్యాట్స్‌మ‌న్ సునీల్ గావస్క‌ర్ భాగ‌మ‌య్యాడు. మ‌హ‌మ్మారిపై పోరుకు ప్ర‌ధాని స‌హాయ నిధితో పాటు మహారాష్ట్ర ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి విరాళం అందించాడు. అయితే ఈ విష‌యాన్ని లిటిల్ మాస్ట‌ర్ నేరుగా ప్ర‌క‌టించ‌లేదు. ముంబై మాజీ కెప్టెన్ అమోల్ మ‌జుందార్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ అంశాన్ని ధ్రువీక‌రించాడు.

'బ్యాటింగ్ లెజెండ్ క‌రోనా వైర‌స్‌పై పోరుకు రూ. 59 ల‌క్ష‌ల ఆర్థిక సాయం చేశాడు. అందులో రూ. 35 ల‌క్ష‌లు పీఎం కేర్స్ నిధికి, మ‌రో రూ. 24 ల‌క్ష‌లు మహారాష్ట్ర ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి కేటాయించాడు. హ్యాట్స‌ఫ్ స‌ర్‌!' అని ట్వీట్టర్​ ద్వారా అభినందనలు చెప్పాడు మజుందార్​.

ఇదీ చదవండి: లాక్​డౌన్​తో చిన్నారుల గేమ్ ఆడుతున్న విరుష్క జోడీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.