టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. లాక్డౌన్ వల్ల ప్రస్తుతం భార్య అనుష్క శర్మ కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలు, వీడియోలను ఇప్పటికే పోస్ట్ చేస్తూ ఉంది అనుష్క. తాజాగా మోనోపాలీ ఆడుతుండగా తీసిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది.
'ఇంట్లోనే ఉండి, అందరినీ జాగ్రత్తగా చూసుకోండి. ప్రస్తుత క్షణాలను ఆస్వాదించండి. కుటుంబసభ్యులతో అనుబంధాలను పెంచుకోండి. మీ జీవితం గురించి వారితో చర్చించండి' అంటూ ఓ వ్యాఖ్యను జోడించింది అనుష్క. అయితే ఈ ఆటలో ఎవరు గెలిచారో చెప్పుకోండి చూద్దాం? అంటూ అభిమానుల్ని అడిగింది.