ETV Bharat / sports

కేరళ రంజీ జట్టులో శ్రీశాంత్.. కానీ?​​ - శ్రీశాంత్ రీఎంట్రీ

ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన బౌలర్ శ్రీశాంత్.. త్వరలో కేరళ తరఫున రంజీలు ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే అతడు ఫిట్​నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది.

Controversial pacer Sreesanth set to play for Kerala Ranji team
కేరళ రంజీ జట్టులో వివాదాస్పద పేసర్ శ్రీశాంత్​​
author img

By

Published : Jun 18, 2020, 3:06 PM IST

స్పాట్​ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్​కు దూరమైన భారత బౌలర్ శ్రీశాంత్.. త్వరలో మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ సెప్టెంబరుతో అతడిపై నిషేధం ముగియనున్న నేపథ్యంలో రంజీల్లో కేరళ తరఫున బరిలోకి దిగనున్నాడు. అయితే ఫిట్​నెస్​ నిరూపించుకున్న తర్వాతే ఇతడిని జట్టులోకి తీసుకోనున్నారు.

2013 మే నెలలో ఐపీఎల్​లో​ స్పాట్​ ఫిక్సింగ్​ ఆరోపణల నేపథ్యంలో శ్రీశాంత్​తో పాటు, రాజస్థాన్​ రాయల్స్ జట్టు​లోని అజిత్​ చండిలియా, అంకిత్​ చవాన్​లను అరెస్టు చేశారు. అనంతరం కేరళ పేసర్​పై భారత క్రికెట్ నియంత్రణ మండలి జీవితకాలం నిషేధం విధించింది. ఆ తర్వాత కోర్టులో బీసీసీఐతో శ్రీశాంత్ సుదీర్ఘ పోరాటం చేయడం వల్ల.. 2015లో దిల్లీ ప్రత్యేక కోర్టు అతడ్ని నిర్దోషిగా ప్రకటించింది. శ్రీశాంత్​పై బీసీసీఐ నిషేధ నిర్ణయాన్ని 2018లో కేరళ హైకోర్టు కూడా కొట్టేసింది.

Controversial pacer Sreesanth set to play for Kerala Ranji team
శ్రీశాంత్​

తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని పునఃపరిశీలించాలని శ్రీశాంత్..​ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. దీంతో ఈ బౌలర్​పై ఉన్న శిక్షను తగ్గించాలని బీసీసీఐకి సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు అతడిపై ఉన్న నిషేధాన్ని జీవిత కాలం నుంచి ఏడేళ్లకు బోర్డు కుదించింది. ఆ గడువు ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తి కానుంది.

ఇదీ చూడండి:'సచిన్ అందుకే కెప్టెన్​గా సక్సెస్ కాలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.