ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం తది జట్టులో చోటు సంపాదించుకోవడానికి ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొందని తెలిపాడు దిల్లీ జట్టు కోచ్ రికీ పాంటింగ్. ఇందులో స్థానం ఎవరు దక్కించుకుంటారనేది చెప్పడం కష్టంగా ఉందని వెల్లడించాడు.
"మా జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ బాగా చేస్తున్నారు. తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే తుది జట్టులో చోటు సంపాదించుకోవడంపై ఆటగాళ్ల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. త్వరలో జరగబోయే మెగాలీగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా."
-రికీ పాంటింగ్, దిల్లీ క్యాపిటల్స్ కోచ్.
ఐపీఎల్ మరో రెండు రోజుల్లో ప్రారంభంకానుంది. సెప్టెంబర్ 19న ముంబయి ఇండియన్స్-చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. సుదీర్ఘ విరామం తర్వాత లీగ్ జరుగుతుండటం వల్ల అన్ని జట్లు తీవ్రంగా సాధన చేస్తున్నాయి. రికీ పాంటింగ్ పర్యవేక్షణలో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో దిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగుతుంది. ఇప్పటివరకు ఒక్క ట్రోఫీని సొంతం చేసుకోలేకపోయింది. సెప్టెంబరు 20న తమ తొలి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలపడనుంది.
ఇదీ చూడండి స్విమ్మింగ్ ఫూల్లో చిల్ అవుతున్న కోహ్లీ