టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతీరుతో పాటు అతడి ప్రవర్తనపై వస్తున్న ఆరోపణలపై అతడి మొదటి గురువు రాజ్‌కుమార్ శర్మ స్పందించారు. ఆటలో దూకుడుగా ఆడినా.. కోహ్లీ దుష్ప్రవర్తనకు లోనవ్వలేదని తెలిపారు.
"కోహ్లీ దూకుడును అందరూ అభినందించారు. అదే అతడికి బలమని నేను నమ్ముతాను. కానీ దూకుడుకి, దుష్ప్రవర్తనకు ఒక గీత ఉంటుంది. దాన్ని ఎప్పుడూ దాటే ప్రయత్నాన్ని అతడు చేయలేదు. కోహ్లీ అద్భుత ఆటగాడు. బాగా బ్యాటింగ్ చేస్తున్నా ఔట్ అవుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో తన పూర్తి సామర్థ్యాన్ని చూపిస్తాడని నమ్ముతున్నా."
- రాజ్‌కుమార్ శర్మ, విరాట్ కోహ్లీ గురువు
కోహ్లీ ఆటతీరుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. త్వరలోనే అతడు పూర్తి సామర్థ్యంతో ప్రదర్శన చేస్తాడని రాజ్‌కుమార్ అన్నారు. న్యూజిలాండ్ పర్యటన మొత్తంలో 218 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. అందులో ఒక అర్ధశతకం మాత్రమే ఉంది.
ఇదీ చూడండి.. అక్షయ్ అభిమానులతో గొడవలు పడొద్దు: అజయ్