ETV Bharat / sports

ఆ సిరీస్​ కోసం దుబాయ్​కి పుజారా, విహారి - australia series pujara vihari

ఆస్ట్రేలియా పర్యటన కోసం టెస్టు ఆటగాళ్లు చెతేశ్వర్​ పుజారా, హనుమ విహారి, కోచ్​ రవిశాస్త్రి ఐపీఎల్​ ఆఖర్లో దుబాయ్​ వెళ్లనున్నారు. అక్కడ మెగాలీగ్​​ పూర్తవ్వగానే టీమ్​ఇండియా బృందంతో కలిసి ఆస్ట్రేలియాకు బయల్దేరుతారు.

cheteswat pujara, hanuma vihari,
పుజారా, విహారి
author img

By

Published : Oct 6, 2020, 9:16 AM IST

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టు జట్టు ఆటగాళ్లు చెతేశ్వర్​ పుజారా, హనుమ విహారి, ప్రధాన కోచ్​ రవిశాస్త్రి, సహాయక సిబ్బంది దుబాయ్​ వెళ్లనున్నారు. ఐపీఎల్​ ఆఖర్లో వీరంతా దుబాయ్​ చేరుకుని అక్కడే ఆరు రోజులు క్వారంటైన్​లో ఉండనున్నారు. ఐపీఎల్​ అనంతరం టీమ్​ఇండియా బృందం ఆస్ట్రేలియాకు బయల్దేరుతుంది. యూఏఈలోని ఒక బయో బబుల్​ నుంచి ఆస్ట్రేలియాలోని మరో బడుగలోకి టీమ్​ఇండియా బృందాన్ని సురక్షితంగా తరలించాలన్నది బీసీసీఐ ఆలోచన. ఆస్ట్రేలియా నిబంధనలు సడలించకపోతే మాత్రం టీమ్​ఇండియాకు 14రోజుల క్వారంటైన్​ తప్పనిసరి.

"టీమ్​ఇండియా మొత్తాన్ని దుబాయ్​ నుంచి ప్రత్యేక విమానంలో ఆస్ట్ట్రేలియా తరలించడమే అన్నిటికంటే అనువైన ప్రణాళిక. అందుకోసం ఈ నెలాఖర్లో పుజారా, విహారి, రవిశాస్త్రి, భరత్​ అరుణ్​, విక్రమ్​ రాఠోడ్​, ఆర్. శ్రీధర్​లు దుబాయ్​ చేరుకుంటారు. వీరికి క్వారంటైన్​ ముగిశాక జట్టంతా కలిసి ఆస్ట్రేలియాకు బయల్దేరుతుంది" అని బీసీసీఐ అధికారి తెలిపారు.

ఇదీ చూడండి కోహ్లీ.. బంతికి ఉమ్ము రాయబోయి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.