ETV Bharat / sports

'షాట్లు ఆడటానికి పుజారా భయపడిపోయాడు' - pujara allan border

సిడ్నీలో జరుగుతున్న టెస్టులో షాట్లు కొట్టేందుకు భారత ఆటగాడు​ పుజారా భయపడ్డాడని ఆస్ట్రేలియా మాజీ సారథి అలెన్​ బోర్డర్ విమర్శించాడు​. అతడి నెమ్మదిగా ఆటడం వారి జట్టుపై తీవ్ర ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డాడు.

pujara
పుజారా
author img

By

Published : Jan 9, 2021, 9:29 PM IST

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టులో టీమ్​ఇండియా క్రికెటర్​ పుజారా బ్యాటింగ్​పై విమర్శలు పలువరు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడీ జాబితాలోకి ఆసీస్​ మాజీ సారథి అలెన్​ బోర్డర్ కూడా చేరిపోయాడు. పుజారా షాట్లు ఆడటానికి భయపడ్డాడని అన్నాడు.

"పుజారా 28.41స్టైక్​రేట్​తో నెమ్మదిగా ఆడాడు. అతడి బ్యాటింగ్​లో తీవ్రత లేదు. దృష్టంతా క్రీజులో ఎక్కువ సేపు ఉండటానికే ప్రయత్నించాడు. షాట్లు ఆడటానికి చాలా భయపడ్డాడు. నిజమే కదా? అతడి ఆటతీరు​ టీమ్​ఇండియాపై తీవ్ర ప్రభావం చూపింది. ఆస్ట్రేలియా బౌలింగ్​ను వారు తట్టుకోలేకపోయారు. ఏదేమైనప్పటికీ ఆసీస్​ బౌలింగ్​ అదరగొట్టింది. ఒక్క బంతిని కూడా వృథా చేయలేదు"

-అలెన్​ బోర్డర్​, ఆసీస్​ మాజీ సారథి

ఈ మ్యాచ్​లో ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. మూడో రోజు పూర్తయ్యేసరికి రెండో ఇన్నింగ్స్​లో రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసి, 197 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అయితే తన ఆటపై వస్తున్న విమర్శలను పుజారా ఖండించాడు. ఇంకా వేగంగా ఆడటం తనవల్ల కాదని అన్నాడు. నాలుగో రోజు ఆటలో తమ జట్టు తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇదీ చూడండి : ఇలానే ఆడతా.. అంతకుమించి కష్టం: పుజారా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.