ETV Bharat / sports

చెపాక్​ స్డేడియంలో ఆ స్టాండ్స్​కు మోక్షం

author img

By

Published : Feb 7, 2021, 7:19 PM IST

చెపాక్​ స్టేడియంలో ఎనిమిదేళ్లుగా మూసివేసిన ఐ,జే,కే (మూడు) స్టాండ్లను ఇంగ్లాండ్​తో రెండో టెస్టు కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని తమిళనాడు క్రికెట్​ అసోసియేషన్​ సెక్రటరీ తెలిపారు. ఈ స్టాండ్లకు సంబంధించిన టికెట్లను ఫిబ్రవరి 8నుంచి ఆన్​లైన్​లో అమ్మనున్నట్లు తెలిపారు.

chepak
చెపాక్​

దాదాపు ఎనిమిదేళ్లుగా మూసివేసిన చెపాక్​ స్టేడియంలోని ఐ,జే,కే (మూడు) స్టాండ్లకు ఇంగ్లాండ్​తో రెండో టెస్టు వల్ల మోక్షం లభించింది. వాటిని తిరిగి తెరవనున్నట్లు తెలిపారు తమిళనాడు క్రికెట్​ అసోసియేషన్​ సెక్రటరీ రామసామి. ప్రస్తుతం వాటిని శుభ్రం చేస్తున్నట్లు చెప్పారు. దాదాపు 12వేల సీట్ల సామర్థ్యం ఉన్న ఈ స్టాండ్స్​కు సంబంధించిన టికెట్లను ఫిబ్రవరి 8(సోమవారం) నుంచి కేవలం ఆన్​లైన్​లో అమ్మబోతున్నట్లు తెలిపారు.

ఒక్కో టికెట్​ ధర రూ. 100,150, 200గా నిర్ణయించినట్లు వెల్లడించారు రామసామి. ఒకవేళ కొనుక్కున్న టికెట్లను రద్దు చేసుకోవాలంటే అందుకు సంబంధించిన ప్రక్రియ స్డేడియం వద్ద ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఆ సమయంలో అక్కడికి వచ్చి ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్​ ధరించడం సహ సామాజిక దూరం పాటించాలన్నారు. రెండో టెస్టు ఫిబ్రవరి 13-17 వరకు జరగనుంది.

2012లో

అప్పట్లో అధునాతంగా నిర్మించిన ఈ మూడు స్టాండ్స్‌కు కొన్ని అనివార్య కారణాల వల్ల అనుమతి ఇచ్చేందుకు చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ నిరాకరించింది. దీంతో.. 2012 నుంచి ఈ స్టాండ్స్​ను మూసేశారు. అంతర్జాతీయ మ్యాచులు జరిగే సమయాల్లోనూ వాటిని తెరవలేదు.

ఇదీ చూడండి: 144 ఏళ్ల రికార్డు బ్రేక్​ చేసిన క్రికెటర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.