కోల్‌కతాతో మ్యాచ్‌లో చెన్నై బౌలర్లు విజృంభించారు. బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుసగా వికెట్లు తీశారు. టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేసిన చెన్నైకి దీపక్ చాహర్ మూడు వికెట్లతో శుభారంభాన్ని అందించాడు. క్రిస్ లిన్, ఊతప్ప, నితీష్ రానాను ఔట్ చేసి కోల్‌కతా శిబిరంలో ఆందోళన నింపాడు. 9 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది కోల్‌కతా. కార్తీక్, శుభమన్ గిల్ కూడా విఫలమయ్యారు.
అనంతరం 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రసెల్ క్యాచ్ హర్భజన్ జారవిడిచాడు. ఊపిరిపీల్చుకున్న రసెల్ తర్వాత అర్ధశతకంతో చెలరేగి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. నిర్ణీత 20 ఓవర్లలో 108 పరుగులు చేసింది కోల్‌కతా జట్టు.
చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్ చెరో రెండు వికెట్లు తీశారు