బౌలర్ల సమష్టి కృషితో మొదట తక్కువ పరుగులకే ప్రత్యర్థిని కట్టడి చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వాట్సన్ (17), రైనా (14), రాయుడు (21) పరుగులు చేశారు. డుప్లెసిస్ 43 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ గెలుపుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది ధోని సేన. మూడు వికెట్లు తీసిన దీపక్ చాహర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు
కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికెట్లు దక్కించుకోగా పీయూష్ చావ్లా ఒక వికెట్ తీశాడు.
-
.@ChennaiIPL overtake #KKR to go top of the table with 10 points 🙌💛#CSKvKKR pic.twitter.com/xWUFRroDcw
— IndianPremierLeague (@IPL) April 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">.@ChennaiIPL overtake #KKR to go top of the table with 10 points 🙌💛#CSKvKKR pic.twitter.com/xWUFRroDcw
— IndianPremierLeague (@IPL) April 9, 2019.@ChennaiIPL overtake #KKR to go top of the table with 10 points 🙌💛#CSKvKKR pic.twitter.com/xWUFRroDcw
— IndianPremierLeague (@IPL) April 9, 2019
చెన్నై బౌలర్ల సమష్టి కృషి
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌పై చెన్నై బౌలర్లు విజృంభించారు. పరుగులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుసగా వికెట్లు తీశారు. మొదటగా దీపక్ చాహర్ మూడు వికెట్లతో జట్టుకు శుభారంభాన్ని అందించాడు. క్రిస్ లిన్, ఊతప్ప, నితీష్ రానాను ఔట్ చేసి కోల్‌కతా శిబిరంలో ఆందోళన నింపాడు. 9 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది కోల్ కతా. కార్తీక్, శుభమన్ గిల్ కూడా విఫలమయ్యారు.
రసెల్ అర్ధశతకం
రసెల్ మరోసారి మెరిశాడు. ఓ వైపు జట్టు వికెట్లు కోల్పోతున్నా అద్భుతమైన అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. 8 పరుగుల వద్ద హర్భజన్ క్యాచ్ వదిలివేయడంతో ఊపిరి పీల్చుకున్న ఈ విండీస్ వీరుడు కోల్‌కతా ఈమాత్రం పరుగులు చేయడంలో కీలకపాత్ర పోషించాడు.
చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్ చెరో రెండు వికెట్లు తీశారు.