టీమ్ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ ముంగిట నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. త్వరలోనే కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వర్మను పెళ్లాడనున్నాడు. అయితే తాజాగా తన ప్రేమ వివాహం గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.
లాక్డౌన్లో క్రికెట్‌కు దూరమై ఇంట్లోనే గడిపిన చాహల్‌కు.. ఆ సమయంలో చాలా బోర్ కొట్టిందని చెప్పాడు. ఇండోర్ జిమ్‌లో కసరత్తులు, ఇంకా అనేక వ్యాపకాలతో గడిపినప్పటికీ వెలితిగానే ఉందనిపించేదట. దీంతో టైంపాస్ కోసం డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్లిన అతడికి.. కొరియోగ్రాఫర్ ధనశ్రీ పరిచయమైనట్లు తెలిపాడు. అలా వారిమధ్య ఉన్న స్నేహం, ప్రేమగా చిగురించిందని స్పష్టం చేశాడు.
దీంతోపాటు లాక్డౌన్ తర్వాత మళ్లీ ఐపీఎల్ 13లో ఆడబోతుండటంపై సంతోషం వ్యక్తం చేశాడు చాహల్. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10వరకు జరగనున్న ఈ మెగాలీగ్‌లో ఆర్సీబీకి పాతినిధ్యం వహిస్తున్నాడు.
ఇదీ చూడండి రియా చక్రవర్తి బెయిల్‌పై తీర్పు వాయిదా