ETV Bharat / sports

ఇంకో వికెట్​ తీస్తే బుమ్రాతో సమంగా చాహల్ - భువనేశ్వర్

ఆస్ట్రేలియాతో తొలి ఇన్సింగ్స్​లో అధ్బుత బౌలింగ్ చేసిన చాహల్​ ఓ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో వికెట్ సాధిస్తే టీ20ల్లో భారత్​ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బుమ్రాతో సమానంగా నిలుస్తాడు.

chahal
ఇంకో వికెట్​ తీస్తే బుమ్రాతో సమంగా చాహల్
author img

By

Published : Dec 5, 2020, 10:31 PM IST

కాన్‌బెర్రా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టీ20లో స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్ (3/25) అద్భుత ప్రదర్శన చేశాడు. జడేజాకు కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన అతడు మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. అంతేగాక పొదుపుగా బౌలింగ్‌ చేసి విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అయితే చాహల్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో వికెట్‌ సాధిస్తే టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రాతో సమానంగా నిలుస్తాడు. ఫామ్‌లో ఉన్న చాహల్.. ఆసీస్‌తో ఆదివారం జరగనున్న రెండో టీ20లో ఈ రికార్డు సాధించడం ఖాయంగా అనిపిస్తోంది.

టాప్​ 5...!

భారత్‌ తరఫున పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన టాప్‌-5 బౌలర్లుగా బుమ్రా, చాహల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ కొనసాగుతున్నారు. బుమ్రా 49 ఇన్నింగ్స్‌ల్లో 59 వికెట్లు సాధించగా.. చాహల్ 43 ఇన్నింగ్స్‌ల్లోనే 58 వికెట్లు పడగొట్టాడు. తర్వాతి స్థానాల్లో అశ్విన్ (52 వికెట్లు, 46 ఇన్నింగ్స్‌లు), భువీ (41 వికెట్లు, 43 ఇన్నింగ్స్‌లు), కుల్‌దీప్‌ (39 వికెట్లు, 20 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు. కాగా, సిడ్నీ వేదికగా ఆదివారం ఆసీస్‌తో భారత్‌ రెండో టీ20 ఆడనుంది. ఈ పోరులో విజయం సాధిస్తే మరో మ్యాచ్‌ మిగిలుండగానే భారత్‌ 2-0తో సిరీస్‌ కైవసం చేసుకుంటుంది.

ఇదీ చదవండి:''కంకషన్​ సబ్​స్టిట్యూట్​'ను దుర్వినియోగం చేయొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.