క్రికెట్ మైదానంలో ప్రశాంతతగా ఉండేందుకు చెస్ ఆడిన అనుభవమే కారణమని అన్నాడు టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్. ఇతడు క్రికెట్ కంటే ముందు చెస్ ప్లేయర్ అని కొంత మందికే తెలుసు. చాహల్.. మాజీ జాతీయ అండర్-12 ఛాంపియన్. భారత్ తరఫున ప్రపంచ యూత్ చెస్ ఛాంపియనషిప్‌లోనూ పాల్గొన్నాడు. 1956 ఎలో రేటింగ్‌తో వరల్డ్ చెస్ ఫెడరేషన్ (ఎఫ్‌ఐడీఈ) వెబ్‌సైట్‌లో స్థానం సంపాదించాడు. అయితే అనంతరం క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకొని, ఉత్తమ స్పిన్నర్‌గా సత్తా చాటుతున్నాడు. కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితవడం వల్ల, తనకు ఇష్టమైన చెస్ గురించి మాట్లాడాడు. ప్రస్తుతం బ్లిట్జ్ ఈవెంట్ ఆడుతున్నాని చెప్పాడు.
"చెస్ నాకు ఎంతో ప్రశాంతత నేర్పింది. క్రికెట్‌లో కొన్నిసార్లు గొప్పగా బౌలింగ్ చేసినా వికెట్లు సాధించలేం. టెస్టు మ్యాచ్‌లో రోజంతా బౌలింగ్ చేసినా బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయలేం. మళ్లీ మరుసటి రోజు కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగాలి. అలాంటి సందర్భాల్లో చెస్ ఆడిన అనుభవం నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రశాంతతో ఉండి బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయగలను. చెస్, క్రికెట్ రెండూ ఇష్టమే. అయితే ఏది ఎంచుకోవాలని మా నాన్నను అడిగాను. నీకు ఇష్టమైనది ఎంపిక చేసుకో అని ఆయన చెప్పారు. ఎక్కువ ఆసక్తి ఉన్న క్రికెట్‌ను కెరీర్‌గా సెలక్ట్ చేసుకున్నా" -చాహల్, భారత బౌలర్
"ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డుప్లెసిస్‌ను ఔట్ చేయడం నా కెరీర్‌లో గొప్పదిగా భావిస్తా. ఎందుకంటే అది నా తొలి ప్రపంచకప్. కీలక మ్యాచ్‌లో ముఖ్యమైన వికెట్ పడగొట్టా. బ్యాట్స్‌మన్‌ను బోల్తా కొట్టించే ముందు నా ప్రణాళికను వికెట్ కీపర్‌కు వివరిస్తా. ధోనీ భాయ్‌కు నా ప్లాన్‌ను చెప్పడాన్ని ఎంతో ఆస్వాదిస్తా" -చాహల్, భారత బౌలర్
కరోనా కారణంగా ఇంటికి పరిమితమవ్వడంపై చాహల్ స్పందించాడు.
" class="align-text-top noRightClick twitterSection" data=""మా కుటుంబంతో ఇంతసేపు ఎప్పుడూ ఉండలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత ఇలా ఇంట్లో ఉంటున్నాను. కుటుంబంతో సమయాన్ని ఆస్వాదిస్తున్నా. ఆలస్యంగా పడుకోవడం, నిద్ర లేవడం చేస్తున్నా. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండండి. ఐక్యంగా ఉంటేనే మహమ్మారి కరోనాపై పోరాడగలం. ఇంట్లోనే ఉంటూ పుస్తకాలు చదవడం, డ్యాన్స్ వేయడం, వంట చేయడం వంటివి చేస్తూ కాలక్షేపం చేయండి" -చాహల్, భారత బౌలర్
Fantastic 4 🤗 #familytime #QuarantineLife #StaySafeStayHome @TikTok_IN pic.twitter.com/BMoBzvvbgo
— Yuzvendra Chahal (@yuzi_chahal) April 6, 2020
">Fantastic 4 🤗 #familytime #QuarantineLife #StaySafeStayHome @TikTok_IN pic.twitter.com/BMoBzvvbgo
— Yuzvendra Chahal (@yuzi_chahal) April 6, 2020
Fantastic 4 🤗 #familytime #QuarantineLife #StaySafeStayHome @TikTok_IN pic.twitter.com/BMoBzvvbgo
— Yuzvendra Chahal (@yuzi_chahal) April 6, 2020