ETV Bharat / sports

ఈసారి అద్భుతం జరగబోతుంది: కోహ్లీ - ఐపీఎల్ తాజా వార్తలు

విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి ఐపీఎల్​లో సత్తాచాటేందుకు సిద్ధమవుతోంది. ప్రతిసారి అభిమానుల అంచనాల్ని అందుకోవడంలో విఫలమవుతున్న జట్టు ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలని అనుకుంటోంది. తాజాగా ఇదే విషయమై మాట్లాడాడు సారథి కోహ్లీ.

Captain Virat Kohli confident of 'miracle' in IPL 2020
ఈసారి అద్భుతం జరగపోతుంది: కోహ్లీ
author img

By

Published : Sep 7, 2020, 5:25 PM IST

విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతిసారి ఐపీఎల్​లో అంచనాలను అందుకోవడంలో విఫలమవుతోంది. చివరిసారిగా 2016లో ఈ జట్టు లీగ్​లో ఫైనల్​ చేరింది. మొత్తంగా ఈ క్యాష్ రిచ్​ లీగ్​లో మూడుసార్లు మాత్రమే తుదిపోరుకు అర్హత సాధించింది. కానీ ఒక్కసారి కూడా టైటిల్​ను దక్కించుకోవడంలో సఫలం కాలేదు. కానీ ఈసారి వేలంలో అనుభవజ్ఞులు, ప్రతిభ గల యువ ఆటగాళ్లను కొనుగోలు చేసిన ఆర్సీబీ ఎలాగైనా విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది. తాజాగా ఇదే విషయమై సారథి కోహ్లీ స్పందించాడు. ఈసారి లీగ్​లో అద్భుతం జరగబోతుందంటూ చెప్పాడు.

"ఐపీఎల్​ సీజన్​కు ముందు నేనూ, డివిలియర్స్ ఎప్పుడూ ఇంత ప్రశాంతంగా లేము. ఏబీ ఈసారి కొత్తగా ఉన్నాడు. అతడు తన సమయాన్ని కుటుంబంతో ఎంజాయ్ చేశాడు. అతడు ఇప్పటికీ 2011లో ఆడినట్లే ఆడుతున్నాడు. అలాగే నాకూ ఈ విరామ సమయం గొప్పగా అనిపించింది. గతంలో ఏం జరిగిందనేది అనవసరం. ప్రస్తుతం ఈ టోర్నీపైనే మా దృష్టంతా. ఏం చేసినా జట్టుగా చేస్తాం. ఈసారి అద్భుతం జరగబోతుంది."

-కోహ్లీ, ఆర్సీబీ సారథి

ఈసారి క్రిస్ మోరిస్, డేల్ స్టెయిన్, ఆరోన్ ఫించ్​ను వేలంలో దక్కించుకుంది ఆర్సీబీ. దీనిపై స్పందించిన కోహ్లీ.. ప్రస్తుతం తమ జట్టు అన్నింటా సమతుల్యంతో ఉందని తెలిపాడు. టీ20 క్రికెట్​కు ఎలాంటి ఆటగాళ్లు కావాలో అలాంటి వారు తమ జట్టులో ఉన్నట్లు వెల్లడించాడు. క్రిస్​ మోరిస్, ఫించ్ అనుభవంతో పాటు జోష్ ఫిలిప్​ వంటి యువ ఆటగాళ్ల ప్రదర్శన కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.