ETV Bharat / sports

'ఆ మ్యాచ్​లో ధోనీ నామీద సీరియస్​ అయ్యాడు'

ఎంత ఉత్కంఠభరిత మ్యాచ్​ అయినా.. ప్రేక్షకులంతా టెన్షన్​ పడుతుంటే మైదానంలో ప్రశాంతంగా కనిపించే వ్యక్తి భారత జట్టు మాజీ సారథి ధోనీ. అందుకే అతడిని 'కెప్టెన్​ కూల్​' అంటారు. కానీ మహీ కోపాన్ని మొదటిసారి చూశానన్నాడు టీమ్​ఇండియా స్పిన్నర్​ కుల్​దీప్​ యాదవ్​. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు.

'Captain cool' Dhoni became angry on spinner KulDeep yadav!
ఆ మ్యాచ్​లో ధోని కోపానికి గురైన కుల్​దీప్​!
author img

By

Published : Apr 18, 2020, 6:33 AM IST

క్రికెట్‌లో 'కెప్టెన్‌ కూల్‌'గా పేరు తెచ్చుకున్న టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ... ఎంత ప్రశాంతంగా ఉంటాడో అందరికీ తెలుసు. మ్యాచ్‌లో నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతున్నా, మైదానం మొత్తం హోరెత్తుతున్నా.. నింపాదిగా తన పని తాను చేసుకుపోతుంటాడు. ఆ ప్రశాంతతతోనే భారత జట్టుకు ఎన్నోసార్లు నమ్మశక్యం కాని విజయాలు అందించాడు. అలాంటి 'కెప్టెన్‌ కూల్‌'కు కోపం వస్తే ఎలా ఉంటుంది? అసలు ధోనీకి కూడా కోపం వస్తుందా? అనే సందేహాలు ఇప్పటికీ అభిమానులకు ఓ ప్రశ్నే. అయితే, మాజీ సారథి అప్పుడప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడని టీమ్‌ఇండియా స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ అన్నాడు.

శ్రీలంకతో జరిగిన ఓ మ్యాచ్‌లో తాను ధోనీ ఆగ్రహానికి గురయ్యానని, అప్పుడు తనకు చాలా భయమేసిందని కుల్‌దీప్‌ చెప్పాడు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన ఈ స్పిన్నర్.. ధోనీ కోపానికి గల కారణాన్ని వెల్లడించాడు.

"ఇండోర్‌లో శ్రీలంకతో జరిగిన ఓ మ్యాచ్‌లో కుశాల్‌ పెరీరా బ్యాటింగ్‌ చేస్తుండగా నేను బౌలింగ్‌ చేశాను. అప్పటికే నా బౌలింగ్‌లో ఒక ఫోర్‌ కొట్టి పెరీరా జోరుమీదున్నాడు. అప్పుడు ధోనీ ఏదో చెప్పాడు. అది నాకు సరిగ్గా అర్థం కాలేదు. తర్వాతి బంతికి పెరీరా రివర్స్‌ స్వీప్‌ ఆడాడు. అప్పుడే ధోనీ ప్రశాంతత కోల్పోయాడు. నా వద్దకు వచ్చి 'నేనేమైనా పిచ్చోడినా? 300 వన్డేలు ఆడాను. ఇక్కడేం జరుగుతుందో నీకు అర్థం అవుతుందా' అని నాతో అన్నాడు. దాంతో ఒక్కసారిగా భయపడిపోయా."

- కుల్​దీప్​ యాదవ్​, టీమ్​ఇండియా స్పిన్నర్​

ఇక మ్యాచ్‌లో గెలిచాక జట్టు హోటల్‌కు.. వెళ్తుంటే ధోనీతో మాట్లాడానని చెప్పాడు కుల్‌దీప్‌. "మహీ భాయ్‌ నీకు కోపం కూడా వస్తుందా?" అని అడిగితే.. ధోనీ ఆసక్తికరమైన విషయం చెప్పినట్లు వెల్లడించాడు.

"నాకు అస్సలు కోపం రాదు. 20 ఏళ్ల క్రితం చివరిసారి కోప్పడ్డా. ఇప్పుడు అనుభవం వచ్చాక అందరితో మాట్లాడాలి. అప్పుడు ఎవరైనా మాట వినకపోతే వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తా. అది కోపం కాదు. నువ్వింకా నా కోపాన్ని చూడలేదు. రంజీట్రోఫీ ఆడే రోజుల్లో నాకు కోపం వస్తుండేది" అని ధోనీ నాతో అన్నాడు. అలాగే టీమ్‌ఇండియాకు ఆడేటప్పుడు ఒక్కోసారి కోపం వచ్చినా.. అది ఎవరికీ తెలియనిచ్చేవాడు కాదంటూ ధోనీ చెప్పిన విషయాన్ని బయటపెట్టాడు చైనామన్‌ బౌలర్‌ కుల్​దీప్​.

ఇదీ చూడండి.. 'శ్రీలంకలో ఐపీఎల్​ నిర్వహించాలనే చర్చ జరగలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.