ETV Bharat / sports

'ఐపీఎల్​ కోసం ఎదురుచూడటం ఇక నా వల్ల కాదు' - dhoni latest news

ఐపీఎల్​ కోసం తను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెన్నై సూపర్​ కింగ్స్​ ఆటగాడు సురేశ్​ రైనా తెలిపాడు. తాజాగా ఇన్​స్టాగ్రామ్​లో ధోనీ, మురళీ విజయ్​తో కలిసి దిగిన ఓ ఫొటోను పోస్ట్​ చేస్తూ.. తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

csk
సీఎస్కే
author img

By

Published : Aug 9, 2020, 5:46 PM IST

కరోనాతో నెలలపాటు నిలిచిపోయిన క్రికెట్​ కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలోనే సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్​ ప్రారంభం కానుండటం వల్ల.. అభిమానుల చూపులన్నీ ఈ లీగ్​పైనే ఉన్నాయి. తాజాగా, చెన్నై సూపర్​ కింగ్స్(సీఎస్కే) బ్యాట్స్​మన్​ సురేశ్​ రైనా స్పందిస్తూ.. టోర్నీ ప్రారంభించే వరకు ఎదురు చూడటం తన వల్ల కాదని ఇన్​స్టాగ్రామ్​ వేదికగా పేర్కొన్నాడు. తన సహచరులు ధోనీ, మురళీ విజయ్​లతో సరదాగా నవ్వుతున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.

"మైదానంలో అడుగుపెట్టేందుకు రోజులు లెక్కిస్తున్నా. ప్రతి నిమిషం ఎంతో ఆనందంగా ఉంది. సీజన్​ ప్రారంభించేవరకు నేను ఎదురు చూడలేకపోతున్నా."

-సురేశ్ రైనా, సీఎస్కే క్రికెటర్​

ఐపీఎల్​ కోసం శిక్షణ ప్రారంభించిన రైనా.. సోషల్​మీడియాలో తరచూ ఏదో ఒక పోస్టు పెడుతున్నాడు. ఇటీవలే నెట్​ప్రాక్టీస్​ చేస్తున్న ఓ వీడియోను పంచుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.