యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు ఎన్నో అవకాశాలు ఇచ్చామని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. అతడి స్థానంలో జట్టు మరొకరిని ప్రయత్నించబోదని స్పష్టం చేశాడు. సమష్టి వైఫల్యంలో అతడినొక్కడినే ఎందుకు బాధ్యుడిని చేయాలని ప్రశ్నించాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 0-2తో వైట్‌వాష్ అయిన తర్వాత విరాట్ మీడియాతో మాట్లాడాడు.
"ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రిషభ్ పంత్‌కు స్వదేశంలో ఎన్నో అవకాశాలు ఇచ్చాం. చాలాసార్లు బాగా ఆడలేదు కానీ ఎంతో శ్రమించాడు. మరొకరికి అవకాశం ఇచ్చేందుకు సరైన సమయమేదో ముందు తెలుసుకోవాలి. అంతేగానీ ఒకటి రెండు వైఫల్యాలకే వెళ్లిపొమ్మంటే వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. జట్టంతా రాణించలేదు. ఒక్కరినే ఇందుకు బాధ్యుడిని చేయలేం. విజయాలను సమష్టిగా ఆనందించాం. ఇప్పుడు ఓటములనూ అలాగే తీసుకుంటాం. జట్టులో ఆయాచితంగా ఎవరికీ అవకాశం ఇవ్వరు. ఏం జరిగినా జట్టులో చోటు ఉంటుందని ఏ ఆటగాడూ అనుకోవడానికి వీల్లేదు. బాధ్యతలు తీసుకొని కష్టపడాలని చెప్పాం. అది జరుగుతుందా లేదా అన్నది వేరే విషయం. నేను అన్ని మ్యాచులు ఆడతాను అనే ఉద్దేశంతో ఎవరూ ఉండరు. పరుగులు చేయనప్పుడు పంత్ ఎంతో కష్టపడ్డాడు. విదేశాల్లో లోయర్ ఆర్డర్‌లో అతడు రాణిస్తాడని మేం అనుకున్నాం. అవకాశం ఇచ్చేందుకు ఇదే సరైన సమయంగా భావించాం. మా ప్రణాళికైతే ఇదే"
- విరాట్ కోహ్లీ, టీమిండియా మాజీ సారథి.
న్యూజిలాండ్‌తో పర్యటనను ముగించుకున్న టీమిండియా ఈనెల 12 నుంచి సఫారీలతో వన్డే సిరీస్‌లో అమీతుమీ తేల్చుకోనుంది.
ఇదీ చూడండి : భారత పర్యటనకు వచ్చే సఫారీ జట్టిదే