ETV Bharat / sports

ధోనీని టీ20 ప్రపంచకప్​ జట్టులోకి తీసుకుంటారా? - at will be your call on Dhoni's future?

బీసీసీఐ సెలక్షన్​ కమిటీ ఛైర్మన్​గా భారత మాజీ ఆల్​రౌండ్​ సునీల్​ జోషి ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో ధోనీ భవితవ్యంపై మీ అభిప్రాయం ఏంటని సెలక్టర్లను ప్రశ్నించింది సీఏసీ. ధోనీని, టీ20 ప్రపంచకప్​ జట్టులోకి తీసుకుంటారా? అని అడిగింది.

dhonis-future
ధోనిని టీ20 ప్రపంచకప్​ జట్టులోకి తీసుకుంటారా?
author img

By

Published : Mar 4, 2020, 8:38 PM IST

Updated : Mar 5, 2020, 8:15 AM IST

టీమిండియా సెలక్షన్‌ కమిటీ నూతన ఛైర్మన్‌గా కర్ణాటకకు చెందిన మాజీ ఆల్‌రౌండర్‌ సునీల్‌ జోషి ఎంపికయ్యాడు. ఈ నిర్ణయాన్ని బీసీసీఐ బుధవారం తీసుకుంది. జోషితో పాటు మాజీ పేస్‌ బౌలర్‌ హర్విందర్‌సింగ్‌కు సెలక్షన్‌ ప్యానెల్‌లో అవకాశం కల్పించింది. వీరితో పాటు జతిన్‌ పరంజపే, దేవాంగ్‌ గాంధీ, శరణ్‌ దీప్‌ సింగ్‌ కమిటీలో కొనసాగనున్నారు.

ఈ నేపథ్యంలో భారత జట్టుతో ధోనీ భవిష్యత్​పై మీ అభిప్రాయమేంటి? అని సెలెక్టర్లను ప్రశ్నించింది మదన్​ లాల్​ నేతృత్వంలోని క్రికెట్​ సలహా కమిటీ (సీఏసీ). మహీని టీ20 ప్రపంచకప్​నకు ఎంపిక చేస్తారా? అనే ప్రశ్నలు వేసింది. దీనిపై ప్యానెల్​ సభ్యులు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.

ఏదేమైనప్పటికీ ధోనీ భవిష్యత్​పై సెలక్టర్లు ఏమనుకుంటున్నారో స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటోంది బీసీసీఐ. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ తర్వాత మైదానంలో కనబడలేదు ధోనీ. అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ చెన్నై చేరుకున్నాడు. ఈ నెల 29న ఆరంభమయ్యే ఐపీఎల్‌ కోసం సాధన మొదలుపెట్టాడు.

ఇదీ చూడండి : బీసీసీఐ సెలక్షన్​ కమిటీ ఛైర్మన్​గా సునీల్​ జోషి

Last Updated : Mar 5, 2020, 8:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.