ETV Bharat / sports

బుమ్రా ఖాతాలో సరికొత్త రికార్డు - బుమ్రా బౌలింగ్​ యావరేజ్​ రికార్డు

టెస్టుల్లో అతి తక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్​గా టీమ్ఇండియా పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రా ఘనత వహించాడు. ఈ ఘనతను బాక్సింగ్​ డే టెస్టు ద్వారా బుమ్రా సాధించాడు. ఫలితంగా టెస్టు క్రికెట్​లో అతి తక్కువ బౌలింగ్​ యావరేజ్​ ఉన్న బౌలర్ల జాబితాలో బుమ్రా అగ్రస్థానానికి చేరుకున్నాడు.

Bumrah overtakes Marshall, Garner, McGrath in bowling average
బుమ్రా ఖాతాలో సరికొత్త రికార్డు
author img

By

Published : Dec 29, 2020, 9:10 PM IST

టెస్టుల్లో అతితక్కువ బౌలింగ్​ సగటును​ నెలకొల్పిన బౌలర్​గా టీమ్ఇండియా పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రా ఘనత సాధించాడు. ఆడిన 16 టెస్టుల్లో 20.68 సగటు​తో 76 వికెట్లను పడగొట్టి ఈ రికార్డును దక్కించుకున్నాడు. ఫలితంగా టెస్టు క్రికెట్​లో అతి తక్కువ బౌలింగ్​ యావరేజ్​ నమోదు చేసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

Bumrah overtakes Marshall, Garner, McGrath in bowling average
జస్​ప్రీత్​ బుమ్రా

ఆ తర్వాతి స్థానంలో వెస్టిండీస్​ మాజీ బౌలర్​ మాల్కం మార్షల్​.. 81 టెస్టుల్లో 20.94 సగటుతో 376 వికెట్లను పడగొట్టాడు. మూడో స్థానంలో అదే జట్టుకు చెందిన జోయెల్​ గార్నర్​ 58 టెస్టుల్లో 20.97 సగటుతో 259 వికెట్లను సాధించాడు. అలాగే నాలుగో స్థానంలో కర్ట్లీ అంబోర్సే (98 టెస్టులు, 20.99 సగటు, 405 వికెట్లు), ఐదో స్థానంలో ఆస్ట్రేలియన్​ పేసర్​ పాట్​ కమిన్స్​ (32 టెస్టులు, 21.51 యావరేజ్​, 153 వికెట్లు), ఆరో స్థానంలో గ్లెన్​ మెక్​గ్రాత్​ (124 మ్యాచ్​లు, 21.64 సగటు, 563 వికెట్లు) ఉన్నారు.

ఆస్ట్రేలియాతో ఆడుతున్న టెస్టు సిరీస్​లో బుమ్రా ఆడిన రెండు మ్యాచ్​ల్లో 8 వికెట్లు పడగొట్టాడు.

ఇదీ చూడండి: టీమ్​ఇండియాకు లక్కీ స్టేడియం.. మెల్​బోర్న్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.