ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్‌స్మిత్.. కోహ్లీ కంటే మెరుగైన ఆటగాడని అభిప్రాయపడ్డాడు ఆసీస్ మాజీ బౌలర్ బ్రెట్‌లీ. డాన్ బ్రాడ్‌మన్ లాగే స్మిత్ మంచి ఆటగాడని ప్రశంసించాడు. కోహ్లీ, స్మిత్‌లలో ఒకర్ని ఎంపిక చేయమని మాజీ జింబాబ్వే క్రికెటర్ పొమ్మీ మబంగ్వా అడగ్గా, ఇన్‌స్టా లైవ్‌లో ఈ సమాధానమిచ్చాడు బ్రెట్‌లీ.
"వీరిద్దరిలో ఉత్తమ ఆటగాడిని ఎంపిక చేయాలంటే కష్టమే. ఇరువురిలో మంచి ఆటగాడి లక్షణాలు ఉన్నాయి. కానీ, నేను బౌలర్‌గా ఆలోచిస్తే వారిలో ఉన్న లోపాలనే ఆలోచిస్తాను. కోహ్లీ టెక్నికల్‌గా ఉత్తమ బ్యాట్స్‌మన్. కానీ, గతంలోని ప్రదర్శన ఇప్పుడు కనబరచడం లేదు. అతనొక గొప్ప నాయకుడు కావొచ్చు. కోహ్లీ ఐపీఎల్ గెలిచేందుకు ఎక్కువ ఇష్టపడతాడు" అని బ్రెట్‌లీ వెల్లడించాడు.
2018లో దక్షిణాఫ్రికా సిరీస్‌లో భాగంగా బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినందుకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి స్మిత్‌ను ఏడాదిపాటు నిషేధం విధించారు. 2019లో మైదానంలో తిరిగి అడుగుపెట్టి, యాషెస్ సిరీస్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు స్మిత్.
"ఏడాది నుంచి స్మిత్ ఆటతీరులో ఎదుగుదలను చూశాను. ప్రస్తుత సమయంలో అత్యుత్తమ ఆటగాడిగా కోహ్లీ కంటే స్మిత్‌నే ఎన్నుకుంటాను. ఎందుకంటే కొన్ని పరిస్థితులను అధిగమించి ఉత్తమ ప్రదర్శన చేస్తున్నాడు. బ్రాడ్‌మన్‌లా మంచి గుర్తింపు సాధిస్తాడని భావిస్తున్నా" అని బ్రెట్‌లీ వెల్లడించాడు.
ఇదీ చూడండి... 'బంతి మెరుపు కోసం ఆ ఏర్పాట్లు చేయాలి'