ETV Bharat / sports

'ఈసారి ఐపీఎల్ టైటిల్ ఆర్సీబీ గెలిచే అవకాశం ఉంది' - కోహ్లీకి బ్రాడ్​హాగ్​

దుబాయ్​లో నిర్వహించనున్న ఐపీఎల్​ 13వ సీజన్​లో ఆర్సీబీ జట్టు ట్రోఫీని ముద్దాడుతుందని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్​ బ్రాడ్​ హాగ్​. ఇందుకోసం కొన్ని టిప్స్​ కూడా చెప్పాడు. లీగ్​లో ముంబయి ఇండియన్స్​ ఉత్తమ జట్టని అభిప్రాయపడ్డాడు.

kohli
కోహ్లీ
author img

By

Published : Jul 26, 2020, 6:51 PM IST

ఈ ఏడాది దుబాయ్​లో జరగనున్న ఐపీఎల్​ 13వ సీజన్​లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ట్రోఫీని సొంతం చేసుకునే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్​ బ్రాడ్​ హాగ్​. అయితే కోహ్లీ సారథ్యంలోని ఈ జట్టు వ్యూహాత్మకంగా ఆడాల్సిన అవసరముందని చెప్పాడు.

"స్టార్​ బ్యాట్స్​మన్​ ఆరోన్​ ఫించ్​(ఆస్ట్రేలియా) పవర్​ప్లేలో దూకుడుగా ఆడి అధిక పరుగులు చేస్తాడు. తద్వారా మిడిల్​ ఆర్డర్​లో ఉన్న కోహ్లీ, ఏబీ డివిలియర్స్(దక్షిణాఫ్రికా) మీద ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. బౌలర్స్​ కేన్​ రిచర్డ్​సన్(ఆస్ట్రేలియా)​, డేల్​ స్టెయిన్​(దక్షిణాఫ్రికా).. జట్టు బౌలింగ్​ను సమతుల్యం చేస్తారు . కాబట్టి ఈ అంశాలు ఆర్సీబీకి కలిసొచ్చే అంశమని నా అభిప్రాయం."

-బ్రాడ్​ హాగ్, ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్​.

లీగ్​లో ముంబయి ఇండియన్స్ ఉత్తమ జట్టు అని కితాబిచ్చాడు బ్రాడ్​. రోహిత్​ శర్మ సారథ్యంలోని ఈ జట్టు కూడా ట్రోఫీని సొంతం చేసుకునే అవకాశాలున్నాయని తెలిపాడు. ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య, స్టార్​ బౌలర్స్​ మలింగ, బుమ్రా వంటి అద్భుతమైన ఆటగాళ్లు ఉండటమే కారణమని వెల్లడించాడు. హార్దిక్​కు​.. 'మ్యాన్​ ఆఫ్​ ది టోర్నమెంట్'​ వరిస్తుందని జోస్యం చెప్పాడు.

సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఈ మెగా టోర్నీ దుబాయ్​లో నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

ఇది చూడండి 'ఇకపై కరోనాతో క్రికెట్​ సహజీవనం తప్పదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.