లాక్‌డౌన్‌లో పడిన కష్టమే టీమ్‌ఇండియా పేసర్ సిరాజ్‌ను ప్రమాదకర బౌలర్‌గా మార్చింది. ఆ సమయంలో అతను ఒకే స్టంప్‌ను లక్ష్యంగా పెట్టుకుని బౌలింగ్ చేశాడట! ఆ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. "2019 ఐపీఎల్‌లో రాణించకపోవడం వల్ల ఈ సీజన్ నాకెంతో కీలకమని తెలుసు. అందుకే లాక్‌డౌన్‌లో బౌలింగ్ మెరుగుపర్చుకోవడంపై పూర్తి దృష్టి సారించా. ఒకే స్టంప్ పెట్టుకుని చాలా ప్రాక్టీస్ చేశా. అందుకే నిరుడు ఐపీఎల్ సహా ఆస్ట్రేలియా పర్యటనలో మంచి ప్రదర్శన చేయగలిగా" అని సిరాజ్ తెలిపాడు.
మరోవైపు ఆస్ట్రేలియాలో సిరాజ్ ప్రదర్శనపై భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ మాట్లాడుతూ.. "సిరాజ్ ప్రదర్శన వెనుక బౌలింగ్ కోచ్ అరుణ్ కీలకంగా వ్యవహరించాడు. హైదరాబాద్ ప్రధాన కోచ్‌గా అతను ఉన్నప్పటి నుంచి సిరాజ్‌ను ప్రోత్సహిస్తూ వచ్చాడు. ముడి సరుకులా ఉన్న అతణ్ని.. మెరుగైన వజ్రంలా మార్చాడు" అన్నాడు. సిరాజ్‌ను మొదట్లో చూసినపుడు అతను కనీసం రాష్ట్ర జట్టుకైనా ఆడతాడని అనుకోలేదని, కానీ అతనెంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడని ఒకప్పటి హైదరాబాద్ కోచ్ అబ్దుల్ అజీమ్ ప్రశంసించాడు.
ఇదీ చూడండి : సిరీస్‌లో తీసిన ప్రతి వికెట్ నాన్నకు అంకితం: సిరాజ్
ఇదీ చూడండి: తండ్రి సమాధి వద్ద క్రికెటర్ సిరాజ్ భావోద్వేగం
ఇదీ చూడండి: 'ఆ రోజు సిరాజ్‌ను ఎందుకు రావొద్దన్నానంటే'