ETV Bharat / sports

ఆసీస్​పై ఇంగ్లాండ్ గెలుపు.. ఆ మ్యాచ్​ గెలిస్తే సిరీస్ సొంతం

ఆసీస్​పై రెండో వన్డేలో గెలిచిన ఇంగ్లాండ్​, సిరీస్​ను సమం చేసింది. బుధవారం జరిగే నిర్ణయాత్మక మూడో మ్యాచ్​లో​ గెలిచిన జట్టు, సిరీస్​ను సొంతం చేసుకుంటుంది.

Bowlers shine as England fight back to beat Australia by 24 runs in 2nd ODI
ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా
author img

By

Published : Sep 14, 2020, 8:00 AM IST

రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ గెలిచింది. ఓల్డ్ ట్రాఫోర్డ్​లో జరిగిన ఈ మ్యాచ్​లో 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. 1-1 తో సిరీస్ సమమైంది. దీంతో బుధవారం జరిగే మూడో వన్డేలో విజయం సాధించిన జట్టు, సిరీస్​ సొంతం చేసుకుంటుంది.

jofra archer
ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ జోఫ్రా ఆర్చర్

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. రాయ్ (21), రూట్ (39), మోర్గాన్ (42), క్రిస్ వోక్స్ (26), టామ్ కరన్ (37), ఆదిల్ రషీద్ (35) రాణించారు. ఆసీస్ బౌలర్లలో జంపా 3 వికెట్లు తీయగా, స్టార్క్ 2, హేజిల్​వుడ్, కమిన్స్, మిచెల్ మార్ష్​ తలో వికెట్ పడగొట్టారు.

ఛేదనలో ఆస్ట్రేలియా.. 48.4 ఓవర్లలో 207 పరుగులే చేసి ఆలౌటైంది. కెప్టెన్ ఫించ్ (73), లబుషేన్(48), అలెక్స్ క్యారీ(36) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. మిగత బ్యాట్స్​మెన్ విఫలమవడం వల్ల మ్యాచ్​ ఓడిపోయింది కంగారూ జట్టు. ఇంగ్లీష్ బౌలర్లలో వోక్స్, ఆర్చర్, సామ్ కరన్ తలో మూడు వికెట్లు తీశారు. రషీద్ ఓ వికెట్ పడగొట్టాడు.

ENG VS AUS
ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా రెండో వన్డేలోని దృశ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.