సినిమా, క్రికెట్.. ఈ రెండు రంగాలది విడదీయరాని బంధం. ఈ రెండింటికి ప్రేక్షకుల్లో విశేష ఆదరణ ఉంది. అందుకే వీటికి సంబంధించి ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ఇక క్రికెటర్స్ హీరోయిన్స్ మధ్య ఎఫైర్స్ అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీరి మధ్య ప్రేమాయణం ఈనాటిదికాదు.. నాటి ఇమ్రాన్ ఖాన్- దీవా జీనత్, కపిల్‌దేవ్-సారికా నుంచి నేటి విరాట్ కోహ్లీ-అనుష్కశర్మ వరకు ఎందరో క్రికెటర్లు హీరోయిన్లు మధ్య ప్రేమకథలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. కానీ ఇందులో చాలా వరకు మధ్యలోనే బ్రేకప్ అవ్వడం.. కొన్ని అవి నిజం కాదని తేలడం, మరికొన్ని పెళ్లి పీటలు వరకు వెళ్లడం జరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు మన స్టార్ క్రికెటర్లు హీరోయిన్స్ మధ్య చిగురించినట్లు తెలిసిన ప్రేమ కథల సమాహారమే ఈ కథనం.
ఇమ్రాన్ ఖాన్- దివా జీనత్
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్ సీనియర్ నటి దివా జీనత్ రిలేషిన్‌షిప్‌లో ఉన్నట్లు అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. ఎక్కడు చూసిన ఈ జంట కెమెరా కంటికి తెగ కనిపించేవారు. వీరి గురించి అనేక కథనాలు ప్రచరితమయ్యేవి. కానీ ఆ తర్వాత జీనత్, మజ్హర్ను మనువాడగా.. ఇమ్రాన్, బ్రిటీష్ బిలీయనీర్ హైరెస్ జెమిమా గోల్డ్‌స్మిత్‌ను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన పాకిస్థాన్‌కు ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు.
వీవ్ రిచర్డ్స్-నీనా గుప్తా
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వీవ్ రిచర్డ్స్, సీనియర్ నటి నీనా గుప్తా అప్పట్లో కొంతకాలం ప్రేమించుకున్నారు. వీరిద్దరికీ ఓ బిడ్డ కూడా జన్మించింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నీనా, వీవ్ విడిపోయి వేర్వేరుగా వివాహాలు చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందే బిడ్డకు జన్మనివ్వడం వల్ల సమాజంలో తనపై ప్రతికూల ప్రభావం పడిందని నీనా ఓ సందర్భంలో తెలిపింది. చివరిగా 'శుభ్ మంగళ్ జ్యాదా సావ్ధాన్' అనే బాలీవుడ్ చిత్రంలో ఆమె నటించింది.
కపిల్‌దేవ్- సారికా
భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ పెళ్లికి ముందు సీనియర్ నటి సారికాతో ప్రేమాయణం నడిపాడు. ఎక్కడ చూసిన ఈ జంట తెగ కనపడేవారు. అనంతరం కొన్ని కారణాల వల్ల విడిపోయి కపిల్.. రోమి భాటియాను, సారికా స్టార్ నటుడు కమలహాసన్‌ను పెళ్లిచేసుకున్నారు.
మహ్మద్ అజారుద్దీన్- సంగీత బిజ్లానీ
1996లో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజా బాలీవుడ్ సీనియర్ నటి, 1980 మిస్ఇండియా విజేత సంగీత బిజ్లానీ.. తాము ప్రేమలో ఉన్నట్లు పెళ్లి కూడా చేసుకోబోతున్నామని బహిరంగంగానే ప్రకటించారు. కానీ అది జరగలేదు.
మోహ్సిన్ ఖాన్- రీనా రాయ్
పాకిస్థాన్ మాజీ క్రికెటర్, బాలీవుడ్ సీనియర్ నటి రీనా రాయ్ పీకల లోతుదాగా ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకున్నారు. వారిద్దరికి ఓ బిడ్డ జన్మించాక మనస్పర్థల కారణంగా విడిపోయారు.
రవిశాస్త్రి-అమ్రితా సింగ్
80ల కాలంలో టీమ్ఇండియా కోచ్ రవిశాస్త్రి, నటి అమ్రితా సింగ్ రిలేషన్షిప్లో ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జోరుగా సాగింది. వీరిద్దరికి 1986లో నిశ్చితార్థం కూడా జరిగినట్లు వార్తల వచ్చాయి. కానీ ఆ తర్వాత శాస్త్రి 1990లో రీతూను పెళ్లి చేసుకోగా.. అమ్రితా, నటుడు సైఫ్ అలీఖాన్‌తో ప్రేమలో పడింది.
గంగూలీ-నగ్మా
క్రికెటర్స్ ఎఫైర్స్‌లో హాట్ టాపిక్ అంటే ముందుగా గుర్తొచ్చేది మాజీ క్రికెటర్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సీనియర్ నటి నగ్మా. ఎన్నో వివాదాలకు దారీ తీసింది వీరి ప్రేమకథ. అప్పటికే దాదా డోనా రాయ్‌ను వివాహం కూడా చేసుకున్నాడు. దీంతో ఆమె గంగూలీకి విడాకులు కూడా ఇవ్వడానికి సిద్ధమైంది. ఆ తర్వాత నగ్మా-గంగూలీ విడిపోయాక ఈ వివాదం పరిష్కారమైంది.
అజయ్ జడేజా-మాధురి దీక్షిత్
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా సీనియర్ హీరోయిన్ మాధురి దీక్షిత్ గురించి కార్చిచ్చు అంటుకున్న వేగంగా పుకార్లు వచ్చేవి. మరి ఇది ఎంతవరకు నిజమో వారికే తెలియాలి.
వసీం అక్రమ్-సుస్మిత సేన్
2013లో మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ నటి సుస్మిత సేన్ పాకిస్థాన్ క్రికెటర్ వసీం అక్రమ్ ఇద్దరు ప్రేమలో మునిగితేలారు. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా పెళ్లి చేసుకోకుండానే విడిపోయారు.
కిమ్ షర్మ-యువరాజ్‌సింగ్- దీపికాపదుకొణె
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఒకరి తర్వాత మరొకరితో వరుసగా ప్రేమయాణం నడిపినట్లు గాసిప్స్ బాగా వచ్చాయి. వారిలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. నటి కిమ్ షర్మ కూడా ఉన్నారు.
జహీర్ ఖాన్- ఇషా షవ్రానీ
టీమ్ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్, నటి ఇషా షవ్రానీ దాదాపు ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. అనంతరం విడిపోయి వేరు వేరు పెళ్లిల్లు చేసుకున్నారు.
రోహిత్ శర్మ- సోఫియా హయత్
టీమ్ఇండియా క్రికెటర్ రోహిత్‌శర్మ మోడల్ సోఫియా హయత్ అప్పట్లో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ దీనిపై హిట్‌మ్యాన్ ఎప్పుడు నోరు విప్పలేదు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో సోఫియా.. తామిద్దరు విడిపోయినట్లు బహిరంగంగానే తెలిపింది.
దీపికా-ధోనీ- రాయ్‌లక్ష్మీ
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు చాలా ప్రేమాయణాలు నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2007లో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, 2009లో నటి రాయ్ లక్ష్మీతో ఉన్నట్లు ప్రచారం సాగింది. ప్రస్తుతం మహీ.. తన చిన్ననాటి స్నేహితురాలు సాక్షిని పెళ్లిచేసుకున్నాడు. వారిద్దరికి ఓ పాప కూడా జన్మించింది.