ETV Bharat / sports

తొలి టెస్టులో అందుకే ఓడిపోయాం: కోహ్లీ

author img

By

Published : Feb 9, 2021, 4:33 PM IST

తొలి టెస్ట్​లో ఓటమిపై స్పందించాడు టీమ్​ఇండియా సారథి కోహ్లీ. తమ జట్టు అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయిందన్నాడు. తమ బౌలర్లకు పిచ్​ సహకరించలేదని చెప్పిన విరాట్.​. రెండో టెస్ట్​పై దృష్టి సారించినట్లు తెలిపాడు.

kohli
కోహ్లీ

ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టులో ఓటమి చెందడంపై విచారం వ్యక్తం చేశాడు టీమ్​ఇండియా సారథి కోహ్లీ. తాము అనుకున్నంత ప్రభావవంతంగా ఆడలేకపోయామన్నాడు. ఇంగ్లాండ్​ జట్టు ఉత్తమంగా, నిలకడగా ఆడిందని కితాబిచ్చాడు.

"ప్రత్యర్థి జట్టుపై చెప్పుకోదగ్గ స్థాయిలో తీవ్రత చూపించలేకపోయాం. తొలి ఇన్నింగ్స్​ రెండో అర్ధభాగంలో బ్యాటింగ్​ బాగా చేశాం. రెండో ఇన్నింగ్స్​ పర్వాలేదనిపించేలా ఆడాం. అయితే ఇంగ్లాండ్​ జట్టు మా కన్నా నిలకడగా, ఉత్తమంగా ఆడింది. మేము వారిపై అధిక ఒత్తిడి తీసుకురాలేకపోయాం. మా బౌలర్లు ఎక్కువ పరుగులు సమర్పించారు. తొలి ఇన్నింగ్స్​లో మా బౌలింగ్​ విభాగంలోని ఫాస్ట్​ బౌలర్లు, అశ్విన్ బాగా ఆడినప్పటికీ ప్రత్యర్థిపై ఇంకాస్త ఒత్తిడి తీసుకొచ్చి కట్టడి చేయాల్సింది. ఏదేమైనప్పటికీ ఈ పిచ్​ బౌలర్లకు సహకరించలేదు. అందుకే ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ బాగా ఆడారు. నదీమ్​, సుందర్​ చెప్పుకోదగ్గ స్థాయిలో బౌలింగ్​ చేయలేదు. ​మా బౌలింగ్​ విభాగం మెరుగుపడాలి.. ఇంగ్లాండ్​పై ఆధిపత్యం చలాయించాలి. మొత్తంగా మేము అనుకున్న ప్రణాళికలను సరిగా అమలుచేయడంలో విఫలమయ్యాం. ఏదేమైనప్పటికీ ఈ మ్యాచులో చేసిన తప్పులను సరిచేసుకుని తర్వాతి మ్యాచుల్లో బాగా ఆడతాం."

-కోహ్లీ, టీమ్​ఇండియా సారథి.

తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని ప్రశంసించాడు ఇంగ్లాండ్​ జట్టు సారథి జో రూట్​. ప్రతి ఆటగాడు జట్టుకు తమవంతుగా బాగా సహకరించారని కొనియాడాడు. ఈ మ్యాచులో ఓటమి చెందిన భారత్​.. తిరిగి పుంజుకుని బలంగా తయారయ్యే అవకాశాలున్నాయని రూట్​ అభిప్రాయపడ్డాడు. తర్వాతి మ్యాచ్​ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. సీనియర్​ పేసర్​ జేమ్స్​ అండర్సన్​ బాగా ఆడాడని పొగిడాడు. అతడు జట్టులోని మిగతా ఆటగాళ్లకు రోల్​ మోడల్​ అని కితాబిచ్చాడు.

ఇదీ చూడండి: టెస్టు ఛాంపియన్​షిప్: ఇంగ్లాండ్​ టాప్​.. భారత్​ డౌన్​

ఇదీచూడండి: తొలి టెస్ట్​: ఇంగ్లాండ్​ విజయం- సిరీస్​లో 1-0 ఆధిక్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.