లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన క్రికెటర్లంతా ఆన్లైన్ లైవ్సెషన్స్లో పాల్గొంటూ అభిమానులతో ముచ్చట్లు పెడుతున్నారు. కొంత మంది గత స్మృతులను గుర్తు చేసుకుంటూ.. కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. తాజాగా టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. ఆసక్తికర ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇందులో భారత క్రికెటర్ల ముఖాలను అమ్మాయిలుగా మార్చి.. "మీ గర్ల్‌ఫ్రెండ్‌గా ఎవరిని ఎంచుకుంటారు? నా సమాధానం రేపు చెబుతాను" అంటూ వ్యాఖ్య జోడించి పోస్ట్ చేశాడు యువీ.
- View this post on Instagram
Who will you select as your 👯♀️ girlfriend’? 🤔🤣 I will reply tomorrow 🤪
">
ఈ ఫొటోకు నెటిజన్లు, ఆటగాళ్ల నుంచి అమితమైన స్పందన లభిస్తోంది. చాలామంది క్రికెటర్లు, సెలబ్రిటీలు భువనేశ్వర్ కుమార్‌కు ఓటేశారు. భారత బౌలర్ హర్బజన్ సింగ్, బాలీవుడ్ నటి ఆశిష్ చౌదరి, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ తదితరులు భువనేశ్వర్‌ను తమ గర్ల్‌ఫ్రెండ్‌గా ఎంచుకుంటామని రిప్లై ఇచ్చారు.
ఇక సామాజిక మాధ్యమాల్లో నిత్యం యాక్టివ్‌గా ఉండే క్రికెటర్లలో ఒకరై చాహల్ స్పందిస్తూ.. 'యువీ.. మీకు మీరే కావాలనుకుంటా' అంటూ చమత్కరించాడు. ఆ తర్వాత కోహ్లీ, కేఎల్ రాహుల్ వైపు కొంతమంది మొగ్గు చూపారు. ప్రస్తుతం ఈ విషయంపై నెటిజెన్లు విపరీతంగా చర్చించుకుంటున్నారు.
ఇటీవలే రోహిత్ శర్మ.. ఆడపిల్లగా మారితే ఈ విధంగా ఉంటాడంటూ ఓ ఫొటోను పోస్ట్ చేశాడు చాహల్. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇది చూడండి : రోహిత్ శర్మను అమ్మాయిగా మార్చేసిన చాహల్!