పాకిస్థాన్‌తో జరగనున్న మిగిలిన రెండు టెస్టు మ్యాచ్‌ల నుంచి ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ తప్పుకున్నాడు. కుటుంబ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఈ వారంలో బ్రిటన్ నుంచి న్యూజిలాండ్ బయలుదేరనున్నాడు.
స్టోక్స్ తండ్రి గెడ్ గతేడాది డిసెంబరులో దక్షిణాఫ్రికాలో అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కోలుకుంటున్నారు.
ఇటీవలే వెస్డిండీస్‌తో టెస్టు సిరీస్‌లో తలపడింది ఇంగ్లాండ్. ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు స్టోక్స్. తాజాగా, మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో స్టోక్స్ 0,9 పరుగులు చేసి.. రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించి 1-0తో తేడాతో సిరీస్‌లో ఆధిక్యం సాధించింది ఇంగ్లీష్ జట్టు. ఆగస్టు 13న రెండో టెస్టు మ్యాచ్ సౌతాంప్టన్ వేదికగా ప్రారంభం కానుంది.