ETV Bharat / sports

క్రికెటర్ల గాయాలు.. ప్రమాదంలో కెరీర్లు!

author img

By

Published : Jan 30, 2021, 10:20 AM IST

ప్రతిభ ఉన్నా.. తగినన్ని అవకాశాలు దక్కినా.. టీమ్​ఇండియాకు ఎప్పుడూ దూరమవుతున్నారు కొందరు క్రికెటర్లు. ఫిట్​నెస్​ సమస్యలతో గాయాల పాలవుతున్నారు. ఫలితంగా వారి కెరీర్​ ప్రమాదంలో పడుతుంది. అలాంటి జాబితాలో ఎక్కువగా బౌలర్లే ఉండటం గమనార్హం.

be-careful-injured-cricketers
గాయాల బారిన భారత క్రికెటర్ల కెరీర్లు

అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘకాలం కొనసాగడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అత్యుత్తమ ఫిట్‌నెస్‌ ప్రమాణాలు పాటించాలి. నిత్యం కసరత్తులు చేయాలి. గాయాలు కాకుండా కాపాడుకోవాలి. సరిపడా విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేశారు కాబట్టే సచిన్‌ తెందూల్కర్‌, కపిల్‌ దేవ్‌, ఎంఎస్‌ ధోనీ, రాహుల్‌ ద్రవిడ్‌ వంటి క్రికెటర్లు అన్ని ఫార్మాట్లలోనూ ఎక్కువ మ్యాచులు ఆడగలిగారు. కొందరు ప్రతిభావంతులకు మాత్రం అదృష్టం కలిసిరాలేదు. గాయాల పాలవ్వడంతో కెరీర్‌ సవ్యంగా సాగడం లేదు. అలాంటి వారిలో బౌలర్లే ఎక్కువ మంది ఉండటం గమనార్హం.

భువి.. వచ్చేదెప్పుడో

టీమ్‌ఇండియాకు దొరికిన తురుపు ముక్క భువనేశ్వర్‌ కుమార్‌. బంతిని రెండువైపులా స్వింగ్‌ చేసే ఈ యువ పేసర్‌ ఫిట్‌నెస్‌ ఇబ్బందులు, గాయాల వల్ల ఆడాల్సినన్ని మ్యాచులు ఆడలేకపోతున్నాడు. ఎక్కువగా చీలమండ, కాలి మడమ, పిక్కలు, గజ్జల్లో పట్టేయడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. అందుకే 2012లోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసినా 21 టెస్టులు, 114 వన్డేలు, 43 టీ20లకే పరిమితం అయ్యాడు.

be-careful-injured-cricketers
భువనేశ్వర్​ కుమార్​

లేదంటే ఈ తొమ్మిదేళ్ల కాలంలో అతడు కనీసం 50 టెస్టుల వరకు ఆడేవాడు. నిజానికి ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి చల్లని ప్రదేశాల్లో భువి బౌలింగ్‌కు ఫిదా అవ్వాల్సిందే.

ప్చ్‌.. నెహ్రాకూ తప్పలేదు

పద్దెనిమిదేళ్లు అంతర్జాతీయ క్రికెట్లో ఉంటే ఎన్ని టెస్టులు, ఎన్ని వన్డేలు ఆడాలి. ప్చ్‌..! టీమ్‌ఇండియా ఒకప్పటి పొడగరి పేసర్‌ ఆశిష్‌ నెహ్రాకు ఆ అదృష్టం దక్కలేదు. ఎడమచేతి వాటం పేస్‌ బౌలింగ్‌తో మహామహులనే వణికించిన నెహ్రాను గాయాలు తీవ్రంగా వేధించాయి. ఎక్కువగా గజ్జలు, చీలమండ, పిక్క కండరాల గాయంతో బాధపడ్డాడు. అంతేకాకుండా సుదీర్ఘకాలం వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు.

be-careful-injured-cricketers
ఆశిష్​ నెహ్రా

కీలకమైన పేసర్‌గా ఎదిగిన అతడు జట్టుకు సేవలందించింది మాత్రం తక్కువే. 17 టెస్టులు, 120 వన్డేలు, 27 టీ20లు మాత్రమే ఆడగలిగాడు. అయితే కీలక మ్యాచుల్లో రాణించాడు.

సాహా.. మారాలిక

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా. ఈ విషయంలో ఎవరికీ సందేహాల్లేవ్‌. 2010లోనే టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేసిన సాహా కెరీర్‌లో చాలాకాలం పాటు ఎంఎస్‌ ధోనీ నీడలోనే ఉండిపోయాడు. మహీకి విశ్రాంతి ఇచ్చినప్పుడు అవకాశాలు దక్కేవి. అతడు సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాక రెగ్యులర్‌ కీపర్‌గా ఎదిగాడు. ఇప్పటి వరకు 38 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు.

be-careful-injured-cricketers
వృద్ధిమాన్​ సాహా

వికెట్ల వెనక చురుగ్గా కదిలే సాహాకూ గాయాల బెడద తప్పలేదు. మూడేళ్లుగా అతడు గాయాలతో జట్టుకు దూరమవుతున్నాడు. గతంలో మోచేతికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. క్యాచులు అందుకొనేందుకు విపరీతంగా డైవ్‌ చేసే సాహాకు మోచేతి గాయాలే ఎక్కువ. ఇప్పుడు పంత్‌ రాకతో పోటీ ఏర్పడింది. ఇకపై ఎన్ని ఆడతాడన్నది సందేహమే!

జాదూ లేదు‌

టీమ్‌ఇండియాలో కేదార్‌ జాదవ్‌కు అయినన్ని గాయాలు మరెవ్వరికీ అవ్వలేదేమో! ఆల్‌రౌండర్‌ కోటాలో ఒక సిరీసుకు ఎంపికవ్వడం.. మధ్యలో గాయపడటం.. మూడు నెలలు జట్టుకు దూరమవ్వడం అన్నట్టుగా ఉండేది అతడి వ్యవహారం. అందుకే ప్రతిభ ఉన్నా.. అవకాశాలు దక్కినా సరైన న్యాయం చేయలేకపోయాడు. చాలా సందర్భాల్లో భుజం, వెన్ను నొప్పి, చీలమండ, గజ్జల్లో గాయాలతో ఇబ్బంది పడ్డాడు.

be-careful-injured-cricketers
కేదార్​ జాదవ్

2014లోనే జట్టులోకి వచ్చినా ఈ కారణాలతోనే కేవలం 73 వన్డేలు, 9 టీ20ల్లో మాత్రమే ఆడాడు. మిడిలార్డర్‌లో ప్రాధాన్యం ఇచ్చినా అందిపుచ్చుకోలేకపోయాడు. 2019 వన్డే ప్రపంచకప్ ‌ముందు సైతం అతడు గాయపడటం గమనార్హం. ఫిట్‌నెస్‌ విషయంలో జాదవ్‌ అత్యంత పేలవం.

పాండ్య.. జాగ్రత్త

హార్దిక్‌ పాండ్య.. టీమ్‌ఇండియా ఎక్స్‌ ఫ్యాక్టర్‌. అతనాడితే ఎంత విధ్వంసకరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అతడి బౌలింగ్‌ ఎంత ఉపయోగకరమో, జట్టు కూర్పునకు అతడెంత అవసరమో అందరికీ తెలిసిందే. ఫిట్‌నెస్‌ విషయంలో వెనుకాడని పాండ్య గతేడాది సాంతం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. వెన్నుముకకు శస్త్రచికిత్స చేయించుకోవడమే ఇందుకు కారణం. చాన్నాళ్లుగా ఈ యువ ఆల్‌రౌండర్‌ వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు.

be-careful-injured-cricketers
హర్దిక్​ పాండ్య

ఆసియాకప్‌ సమయంలో నొప్పితో విలవిల్లాడటంతో లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఐపీఎల్‌ ముందు వరకు అతడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ లీగ్‌లోనూ బౌలింగ్‌ చేయలేదు. ఆసీస్‌ సిరీసులోనూ 4 ఓవర్లు తప్ప బంతి ఇవ్వలేదు. ఇప్పటికీ అతడు బౌలింగ్‌ ఫిట్‌నెస్‌ సాధించనట్టే కనిపిస్తోంది. సుదీర్ఘ భవిష్యత్తు ఉన్న పాండ్య మున్ముందు గాయాల పాలవ్వకుండా చూసుకోవాలి.

మునాఫ్‌దీ అదే స్థితి

ఒకప్పటి సీనియర్‌ పేసర్‌ మునాఫ్ పటేల్‌దీ అదే పరిస్థితి. 2011 వన్డే ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషించిన మునాఫ్‌ స్థాయికి తగినట్టు సుదీర్ఘ కాలం భారత్‌కు ఆడలేకపోయాడు. పెద్ద వయసు, ఫిట్‌నెస్‌ ఇబ్బందులకు తోడు గాయాలు వేధించాయి.

be-careful-injured-cricketers
మునాఫ్ పటేల్​

తరచూ అతడు కాలిమడమ, వెన్నునొప్పితో బాధపడేవాడు. 13 టెస్టులు, 70 వన్డేలు, 3 టీ20లు ఆడగలిగాడు. టెస్టుల్లో 35, వన్డేల్లో 86, టీ20ల్లో 4 వికెట్లు తీశాడు. జట్టులో ఉన్నంత వరకు అతడికి ప్రాధాన్యం బాగానే దక్కింది.

ఇదీ చదవండి: కూతురిని చంపేసి.. నాలుక కోసి తినేసింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.