వచ్చే నెలలో ఈ సీజన్ రంజీ ట్రోఫీని నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది బీసీసీఐ. ప్రస్తుతం జరుగుతోన్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ కోసం ఏర్పాటు చేసిన ఆరు బయోబబుల్స్లోనే ఈ టోర్నీని నిర్వహించాలని యోచిస్తోంది. నేడు(జనవరి 17) జరగనున్న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో ఈ విషయమై చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.
"90శాతం ఫిబ్రవరిలో రంజీట్రోఫీ జరుగుతుంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ కోసం ఏర్పాటు చేసిన బయోబబుల్స్లోనే ఈ టోర్నీని నిర్వహిస్తాం. ఈ టోర్నీ లీగ్ స్టేజ్‌ను ఐపీఎల్ ప్రారంభానికి ముందు నిర్వహిస్తాం. ఈ మెగాలీగ్ పూర్తవ్వగానే నాకౌట్స్, క్వార్టర్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ నిర్వహిస్తాం.''
"-బీసీసీఐ అధికారి.
ఈ సమావేశంలో 2023-2031వరకు జరగాల్సిన ఐసీసీ ఎఫ్టీపీ కమిట్మెంట్స్ సహా పలు అంశాల గురించి చర్చించనున్నట్లు సదరు అధికారి వెల్లడించారు.
ఇదీ చూడండి : భరతనాట్యం స్పిన్.. యువీ వీడియో వైరల్