టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్కు ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు. మహీకి వీడ్కోలు మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐని పలువురు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో దీని గురించి బోర్డు అధికారి ఒకరు మాట్లాడారు.
ఐపీఎల్ జరుగుతున్నప్పుడు లేదంటే ఆ తర్వాత వీడ్కోలు మ్యాచ్ గురించి ధోనీతో చర్చిస్తామని ఆ అధికారి అన్నారు. అతడి ఏం చెబుతాడో దాని బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
"ప్రస్తుతం అంతర్జాతీయ సిరీస్లు లేవు. ఈ విషయమై ఐపీఎల్ పూర్తయిన తర్వాత మహీతో చర్చిస్తాం. అనంతరం నిర్ణయం తీసుకుంటాం. ధోనీ దేశానికి ఎంతో చేశాడు. మేం కూడా అతడికి ఘనంగా వీడ్కోలు పలకాలని అనుకుంటున్నాం"
-బీసీసీఐ అధికారి
ధోనీ చివరి అంతర్జాతీయ మ్యాచ్ను అతడి స్వస్థలం రాంచీలోనే నిర్వహించాలని బీసీసీఐకి ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ ఇటీవల విజ్ఞప్తి చేశారు.
దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు బయోసెక్యూర్ వాతావరణంలో ఐపీఎల్ 13 జరగనుంది. సీఎస్కే సారథిగా బరిలోకి దిగనున్నాడు ధోనీ. గతేడాది ప్రపంచకప్లో న్యూజిలాండ్తో సెమీస్లో ఆడిన తర్వాత మళ్లీ ఈ మెగాలీగ్తోనే మైదానంలో అడుగుపెట్టనున్నాడు.
ఇది చూడండి సచిన్ X కోహ్లీ : పన్నెండేళ్ల కెరీర్లో ఎవరిది పైచేయి?