ETV Bharat / sports

ఆ ఒక్క ఇన్నింగ్స్​ సచిన్ కెరీర్​ను మార్చింది​

తన క్రికెట్ కెరీర్​లో సచిన్ తెందుల్కర్ ఓపెనర్​గా అరంగేట్రం చేసింది సరిగ్గా ఈరోజే. 1994లో న్యూజిలాండ్​తో జరిగిన వన్డేలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మాస్టర్​ కెరీర్​లో ఎన్నో మైలురాళ్లు అందుకున్నాడు.

author img

By

Published : Mar 27, 2020, 3:31 PM IST

సచిన్
సచిన్

సచిన్ తెందుల్కర్.. క్రికెట్​లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. మైదానంలో పరుగుల ప్రవాహాన్ని పారించి అభిమానులకు దేవుడిగా కనిపించాడు. అయితే ఏ క్రికెటర్​కైనా ఏదో ఒక దశలో ఓ అదృష్టం తలుపుతడుతుంది. అలాగే సచిన్​ను కూడా తట్టింది. అదే ఓపెనర్ అవకాశం. కెరీర్ ఆరంభంలో మిడిలార్డర్ బ్యాట్స్​మన్​గా బరిలోకి దిగిన మాస్టర్ న్యూజిలాండ్​పై ఓపెనర్​గా అరంగేట్రం చేశాడు. అది సరిగ్గా ఈరోజే. ఈ సందర్భంగా బీసీసీఐ ట్వీట్​తో ఆ ఇన్నింగ్స్​ను గుర్తు చేసుకుంది.

1994.. మార్చి 27. ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్​తో రెండో వన్డే. ఈ మ్యాచ్​లో మొదటిసారి సచిన్ ఓపెనర్​గా బరిలోకి దిగాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కెరీర్​ను మలుపుతిప్పుకున్నాడు. ఈ మ్యాచ్​లో మాస్టర్ 49 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. ఓపెనర్​గా ఈ ప్రదర్శనతో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు సచిన్. అదే పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తూ దూసుకెళ్లాడు. ఎన్నో మైలురాళ్లు అందుకున్నాడు.

మొత్తంగా కెరీర్​లో 463 వన్డేలు ఆడి 18,426 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు ఉన్నాయి. 200 టెస్టుల్లో 15,921 పరుగులు చేశాడు. అలాగే ప్రపంచకప్​లో మొత్తం 2,278 పరుగులతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.