భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది బీసీసీఐ. రెండేళ్ల కాలానికి ఈ జాతీయ మహిళల టీమ్‌తో పాటు మహిళల ఇండియా-ఏ, మహిళల ఇండియా అండర్-19 జట్ల బాధ్యతలు నిర్వర్తించాలని ప్రకటన జారీ చేసింది.
అర్హతలు..
బీసీసీఐ ప్రకటన ప్రకారం.. దరఖాస్తుదారు అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు లేదా విదేశీ జట్లకు ప్రాతినిధ్యం వహించి ఉండాలి. లేదా ఎన్సీఏ స్థాయి 'సీ' సర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేదా 50 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండి.. ప్రఖ్యాత సంస్థ నుంచి సర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేదా అంతర్జాతీయ క్రికెట్ జట్టుకు ఒక సీజన్ పాటు కోచ్‌గా పని చేసిన అనుభవం ఉండాలి. లేదా టీ20 ఫ్రాంఛైజీకి అయితే రెండు సీజన్ల పాటు కోచ్‌గా చేసి ఉండాలి.
ఇదీ చదవండి: కివీస్ టాప్ క్రికెట్ అవార్డు విలియమ్సన్ సొంతం
దీంతో పాటు పురుషుల జూనియర్ క్రికెట్ జట్టుకు కోచ్ పదవీకి దరఖాస్తులు కోరింది. దరఖాస్తుదారు రాష్ట్ర రంజీ ట్రోఫీలో ప్రాతినిధ్యం వహించి.. కనీసం 25 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలి.
ఇదీ చదవండి: రోహిత్ నమ్మాడు.. రాహులే కారణం.. బోల్తా పడ్డాం!