ETV Bharat / sports

ఐపీఎల్​ ప్రైజ్​మనీలో బీసీసీఐ కోత.. ఇకపై సగమే - Indian Premier League (IPL) latest news

ఈ ఏడాది ఐపీఎల్​ ఛాంపియన్​, రన్నరప్​ ప్రైజ్​మనీలో భారీ కోత విధించేందుకు సిద్ధమవుతోంది బీసీసీఐ. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈనెల 29 నుంచి ప్రారంభం కానుందీ మెగాటోర్నీ.

BCCI has decided to reduce prize money to half for winning and runner-up teams in IPL 2020
ఐపీఎల్​ ప్రైజ్​మనీలో బీసీసీఐ కోత.. ఇకపై సగమే
author img

By

Published : Mar 4, 2020, 3:06 PM IST

ఐపీఎల్ ఖర్చు తగ్గించుకోవడానికి కఠిన నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 13వ సీజన్‌ ప్రైజ్‌మనీని భారీగా తగ్గించేసింది. గతంతో పోలిస్తే సగానికి సగం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని అన్ని ఫ్రాంఛైజీలకు తెలియజేసింది. ఫలితంగా విజేతగా నిలిచిన జట్టుకు రూ.20 కోట్లకు బదులుగా రూ.10 కోట్లు మాత్రమే అందనుంది.

"ఖర్చులు తగ్గించే చర్యల్లో భాగంగా నగదు బహుమతిలో మార్పులు చేశాం. విజేతగా నిలిచే జట్టుకు రూ.20 కోట్లకు బదులుగా రూ.10 కోట్లు లభిస్తాయి. రన్నరప్‌కు రూ.12.5 కోట్లకు బదులుగా రూ.6.25 కోట్లు దక్కుతాయి. ప్రస్తుతం అన్ని ఫ్రాంఛైజీలు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నాయి. తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి స్పాన్సర్‌షిప్స్‌ వంటి మార్గాలు వారికి ఎన్నో ఉన్నాయి. అందుకే ప్రైజ్‌మనీపై ఈ నిర్ణయం తీసుకున్నాం"

-- బీసీసీఐ ప్రతినిధి

క్వాలిఫయిర్స్‌కు అర్హత సాధించిన మిగిలిన రెండు జట్లకు రూ.4.37 కోట్లు అందిస్తామని బీసీసీఐ పేర్కొంది. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రాలకు ఫ్రాంఛైజీ రూ.కోటి, బీసీసీఐ రూ.50 లక్షలు అందించనుంది. వీటితో పాటు బీసీసీఐ మరో నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎనిమిది గంటల కన్నా తక్కువ ప్రయాణ సమయం పట్టే ఆసియా దేశాలకు.. బిజినెస్‌ క్లాస్‌లో వెళ్లేందుకు బీసీసీఐ మిడ్‌ లెవల్‌ ఉద్యోగులకు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది.

BCCI has decided to reduce prize money of ipl
ఐపీఎల్​ ట్రోఫీ

ఈనెల 29 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 13వ సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్‌ తలపడుతోంది. ఫైనల్ మే 24న జరగనుంది.

  • ఇదీ చూడండి...

ఐపీఎల్​కు కరోనా ముప్పు తప్పదా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.