భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు విరుచుకుపడ్డారు. ఫలితంగా బంగ్లాదేశ్.. మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్ షమి 3 వికెట్లతో ఆకట్టుకోగా.. అశ్విన్, ఉమేశ్, ఇషాంత్ తలో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లో ముష్ఫీకర్ రహీమ్‌దే(43) అత్యుత్తమ స్కోరు.
-
Unstoppable India 🔥
— ICC (@ICC) November 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Bangladesh are all out for 150.#INDvBAN ➡️ https://t.co/mHaYgJlrF1 pic.twitter.com/Yx0QSdA0jW
">Unstoppable India 🔥
— ICC (@ICC) November 14, 2019
Bangladesh are all out for 150.#INDvBAN ➡️ https://t.co/mHaYgJlrF1 pic.twitter.com/Yx0QSdA0jWUnstoppable India 🔥
— ICC (@ICC) November 14, 2019
Bangladesh are all out for 150.#INDvBAN ➡️ https://t.co/mHaYgJlrF1 pic.twitter.com/Yx0QSdA0jW
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 12 పరుగుల వద్దే ఓపెనర్ ఇమ్రుల్ కేయస్(6) వికెట్ తీసి దెబ్బతీశాడు ఇషాంత్. కాసేపటికే మరో ఓపెనర్ ఇస్లామ్‌ను(6) ఔట్ చేసి బంగ్లాను కష్టాల్లో పడేశాడు ఉమేశ్. క్రీజులో నిలదొక్కుకుంటున్న మిథున్‌ను(13) ఎల్బీడబ్ల్యూ చేశాడు షమి.
అనంతరం కెప్టెన్ మోమినుల్ హక్(37) - ముష్ఫికర్ రహీమ్(43) జోడీ బంగ్లా ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నిలకడగా ఆడుకున్న మోమినుల్‌ను ఔట్ చేసి బంగ్లాను దెబ్బతీశాడు అశ్విన్. అక్కడి నుంచి బంగ్లా బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ క్యూ కట్టారు.
షమి ఒకే ఓవర్లో..
టీ విరామానికి ముందు టీమిండియా పేసర్ మహ్మద్ షమి.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మొదట ముష్ఫీకర్ రహీమ్‌ను అద్భుత డెలివరీతో బౌల్డ్ చేశాడు. మరుసటి బంతికే మెహదీ హసన్‌ను(0) ఎల్బీడబ్ల్యూగా వెనక్కిపంపాడు.
-
A brilliant outing for #TeamIndia bowlers in the 1st innings.@y_umesh picks up the final wicket as Bangladesh are bowled out for 150.
— BCCI (@BCCI) November 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
We will be back shortly. Stay tuned #INDvBAN pic.twitter.com/RrmpxG2B37
">A brilliant outing for #TeamIndia bowlers in the 1st innings.@y_umesh picks up the final wicket as Bangladesh are bowled out for 150.
— BCCI (@BCCI) November 14, 2019
We will be back shortly. Stay tuned #INDvBAN pic.twitter.com/RrmpxG2B37A brilliant outing for #TeamIndia bowlers in the 1st innings.@y_umesh picks up the final wicket as Bangladesh are bowled out for 150.
— BCCI (@BCCI) November 14, 2019
We will be back shortly. Stay tuned #INDvBAN pic.twitter.com/RrmpxG2B37
అశ్విన్ 250 వికెట్లు..
సొంతగడ్డపై వేగంగా 250 టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు రవిచంద్రన్ అశ్విన్. 42 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించి, ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ముత్తయ్య మురళీధరన్ సరసన చేరాడు. బంగ్లా కెప్టెన్ మోమినుల్ హక్‌ను ఔట్ చేసి 250వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.
ఇదీ చదవండి: సొంతగడ్డపై వేగంగా 250 వికెట్లు తీసిన అశ్విన్